Andhra Pradesh 3 Capital: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది.
#AskKtr (ఆస్క్ కేటీఆర్) అనే హ్యష్ ట్యాగ్‌తో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు నెటిజెన్స్‌తో కాసేపు సరదాగా చిట్ చాట్ చేశారు. రాష్ర్టంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు నుంచి ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు, ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన వరకు అనేక కీలక అంశాలు ట్విటర్‌లో చర్చకొచ్చాయి.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలియజేస్తూ ఏపీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు ఒక్క రోజు మౌన దీక్ష చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారో.. అదే చోట నేడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు దిగారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారిగా నేడు రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నుంచి రాజధాని తరలింపు.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, రైతుల ఆందోళనలు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu) కలిశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో భేటి అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.