India Vs China : గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తరువాత భారత- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా భారత ప్రభుత్వం విమానయాన సంస్థలకు అనదికారి సూచనలు జారీ చేసింది. భారతదేశంతో పాటు ఇతర విదేశీ విమానయాన సంస్థలను చైనా పౌరులను భారత దేశంలోకి తీసుకురావద్దు అని తెలిపినట్టు సమాచారం.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్‌కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ( China ) పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ (india) ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనికుడిని మంగళవారం రాత్రి ఇండియన్ ఆర్మీ అధికారులు చైనా అధికారులకు అప్పగించారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత్-చైనా సైన్యం మధ్య సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసి.. భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరిపిందంటూ మంగళవారం ఉదయం ఆరోపించింది. అయితే.. చైనా ఈ ప్రకటనను భారత ఆర్మీ ఖండించింది.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాఘాతానికి పాల్పడ్డ నాటినుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరుదేశాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యంపై చైనా దురఘాతానికి పాల్పడిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ) చైనాకు వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని లక్ష్యంగా చేసుకుంటూ పలు విమర్శలు సంధించారు. గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘటన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
చైనా (china) భూ దాహానికి అంతులేకుండా పోతోంది. కరోనా వైరస్ (Coronavirus) ను మొత్తం ప్రపంచానికి వ్యాప్తిచేసిందన్న ఆరోపణల తరువాత చైనా అనేక దేశాలతో సంబంధాలను తెంచుకుంటూ ఘర్షణలకు దిగుతూ వస్తోంది. ఇటీవలనే భారతదేశం (india-china), మయన్మార్, జపాన్ తరువాత, చైనా ఇప్పుడు రష్యా (russia)కు వ్యతిరేకంగా కయ్యానికి కాలుదువ్వుతోంది.
లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) స్వయంగా లడాఖ్‌లోని లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు.
Colonel Santosh Babu`s mortal remains | హైదరాబాద్: లడాఖ్‌లోని భారత్ - చైనా సరిహద్దుల వద్ద గాల్వన్ వ్యాలీలో భారత సైనికులకు, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం హైదరాబాద్ చేరుకుంది.
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట : లడాఖ్‌లోని భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ( Indian Army vs Chinese troops ) వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఇండియన్ ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి తరలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట లో ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎయిర్ బేస్‌కి కానీ లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు కానీ చేరుకునే అవకాశం ఉంది. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు.
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో తూర్పు లడాఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. "దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది" అని స్పష్టంచేసింది.
Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్‌లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.