ప్రతిపక్షాలు చెబుతున్నట్లు తాను ఎప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలుపుతూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదాకు సమాన స్థాయి ప్యాకేజీ ఇస్తానంటేనే తాను ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు ప్యాకేజీ నిధులు ఇస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది. ప్యాకేజీపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. హోదాకు సమాన స్థాయి ప్యాకేజీ ఇవ్వలేకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్యాకేజీ ఇవ్వకుంటే..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించిన సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ఇదే సమయంలో టీడీపీపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఏమన్నారంటే ..విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చమని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాం తప్ప అదనంగా ఏమీ అడగడం లేదన్నారు. మిత్రధర్మం వల్లే ఇనాళ్లు ఓపిక పట్టాం లేదంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని కేంద్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ పూర్తి స్థాయిలో సభను బహిష్కరించడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బహిష్కరించడమంటే సభను అవమానించడమేనని.. వైసీపీ తీరు ప్రజా సమస్యలను పరిష్కరించే పవిత్ర వేదికైన అసెంబ్లీని కించపరిచే విధంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో వైపు వైసీపీ వాదన మరో విధంగా ఉంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.