జగన్ పాదయాత్రకు తొలి అడ్డంకి ఎదురైంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం అగ్రహానికి చేరుకున్న జగన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ మద్దతు ఇచ్చే వరకు పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ జగన్ ను అడ్డుకున్నారు. జగన్ నోటి నుంచి స్పష్టమైన వైఖరి తెలిపే వరకు యాత్రను తాము సాగనివ్వబోమని కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
జగన్ సిబ్బందితో వాగ్వాదం
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్లీస్ స్వీప్ చేయడం ఖాయమని డిప్యూటీ సీఎం కేసీఆర్ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఓడిపోతారని తెలిసి కూడా ఎన్నికల్లో వైసీపీ పోటీచేయకపోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరోలా స్పందించింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ప్రతిపక్ష పార్టీ మహిళా నేత రోజా స్పందిస్తూ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చుతానన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరిందని.. మన రాష్ట్రం ఏ రంగంలో నెంబర్ వన్ సాధించిందో తెలియదు కానీ.. ఎయిడ్స్ వ్యాధి, మహిళ అక్రమ రవాణా విషయంలో నెంబర్ వన్ స్థాయిని అందుకుందని రోజా ఎద్దేవ చేశారు.
ఏపీ మంత్రి అఖిలప్రియకు సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అధినేత ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అఖిల కంగు తిన్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...
ఇటీవలికాలంలో సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో నటుడు జగపతిపతిబాబు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం జగపతి బాబు తన స్టైల్ కు భిన్నంగా వైజాగ్ బీచ్ వద్ద పంచకట్టెతో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా విలేఖరులు తన కొత్త గెటప్ పై ప్రశలు సంధించగా ..ఈ గెటప్ గురించి రెండు రోజుల్లో సమాధానం చెబుతానని ఆయన సమాధానమిచ్చారు. అయితే అతని అభిమానులు మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన కొత్త గెటప్ పై మాట్లాడుతూ రెండు రోజుల్లో చెబుతాననడం.పొలిటికల్ ఎంట్రీగురించేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పాంత్రాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్ కు పోయే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. వివరాల్లోవెళ్లినట్లయితే.. అనంతపురం అభివృద్ధిపై మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో జగన్పై ఫైర్ అయ్యారు... పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్ ..సీఎం చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీ నాయకుడిగా ఓట్లు సంపాదించాలనుకోవడంలో తప్పులేదు కానీ.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.