అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పాంత్రాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్ కు పోయే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. వివరాల్లోవెళ్లినట్లయితే.. అనంతపురం అభివృద్ధిపై మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో జగన్పై ఫైర్ అయ్యారు... పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్ ..సీఎం చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీ నాయకుడిగా ఓట్లు సంపాదించాలనుకోవడంలో తప్పులేదు కానీ.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తావా..?
కరవు ప్రాంతమైన రాయలసీమకు నీరందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ఓట్ల కోసం దీన్ని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని జేసీ విమర్శించారు. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని..పల్నాడుకు నీరు ఇవ్వాలనే విధంగా అంబటిరాంబాబు చేత మాట్లాడించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దృష్టి అంతా సీఎం పదవిపైనే ఉందని...ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేసేందుకు జగన్ వెనుకాడటం లేదని జేసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.