BJP: 80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ..'గాంధీ'లకు మెుండిచేయి..తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు..!

భాజపా సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా మొత్తం 80 మందితో జాతీయ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది కమలదళం. ఈ కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌గాంధీని తొలగించారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 04:24 PM IST
BJP: 80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ..'గాంధీ'లకు మెుండిచేయి..తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు..!

BJP: భాజపా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ఎంపీలు మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీ(MP Varun Gandhi)లకు ఈసారి చోటు దక్కలేదు. వ్యవసాయ చట్టాలు(farm laws), లఖింపుర్‌ ఖేరి ఘటనలపై వరుణ్‌ గాంధీ ట్వీట్లు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం 80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. 

ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్‌ అఫిషియో సభ్యుల పేర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP President JP Nadda) ఖరారు చేసినట్టు భాజపా జాతీయ అధికార ప్రతినిధి అరుణ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(BJP national executive committee)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), ఎల్‌కే ఆడ్వాణీ, డాక్టర్‌ మురళీమనోహర్‌ జోషీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. అలాగే, ఈ జాతీయ కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా 50మంది, ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా  179మందిని ఎంపిక చేసినట్టు అరుణ్‌సింగ్‌ వెల్లడించారు.

Also Read: PM Modi: పీఎం కేర్స్ నిధుల కింద 35 ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు..ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల నుంచి...
 ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, జి. రామ్మోహన్‌రావులకు అవకాశం లభించింది. . ప్రత్యేక ఆహ్వానితులుగా విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం లభించింది. 

వారిద్దరికీ మొండిచేయి!
భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి మేనకా గాంధీ(Maneka Gandhi), వరుణ్‌ గాంధీలను ఈసారి తప్పించడం గమనార్హం. వరుణ్‌ గాంధీ ఫిలిబిత్‌ నియోజకవర్గం నుంచి, మేనకా గాంధీ సుల్తాన్‌పుర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో పాటు లఖింపుర్‌ ఖేరి(Lakhimpur Kheri Voilence)లో హింసాత్మక ఘటనలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన గొంతు విన్పిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News