కరోనా వైరస్ కారు తయారీ కోసం ఆయనకు 10 రోజుల సమయం పట్టిందట. సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం 100 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 40 కి.మీ మైలేజీ ఇవ్వగలదు.
దేశ రాజధాని ఢిల్లీలో 'కరోనా వైరస్' ఉద్ధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్ మర్కజ్ భవనం ప్రభావం ఎక్కువగా ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్లో వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసుల సంఖ్య 404కు పెరిగింది.
ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న 'కరోనా వైరస్' చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైంది. దాంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. ఐతే రెండు నెలల పాటు కొనసాగిన లాక్ డౌన్ నేటితో అంతమైంది. ఈ రోజు నుంచి వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి జనం ఊపిరిపీల్చుకున్నారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతోపాటు దేశంలో 'కరోనా వైరస్' గురించి సమాచారం కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇందులో కొంత మంచి సమాచారం కాగా.. మరికొంత ఫేక్ సమాచారం కూడా ఉంటోంది. ముఖ్యంగా ఈ సమాచారం సోషల్ మీడియాలో వెబ్సైట్లతోపాటు సోషల్ మీడియా మెసేంజర్లలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వేళ.. అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
'కరోనా వైరస్' ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో జనం గడప దాటకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గజగజా వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
'కరోనా వైరస్' మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఔషధం 'హైడ్రాక్సీక్లోరోక్విన్'. ప్రస్తుతం ఈ ఒక్క ఔషధం మాత్రమే గేమ్ చేంజర్ గా ఉంది. అంటే దీని ద్వారా కరోనా వైరస్ లొంగి వస్తోంది. ఫలితంగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న భారత్ వైపు అన్ని దేశాల చూపు నెలకొంది.
'కరోనా వైరస్' దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐతే లాక్ డౌన్ విధించడంతో కొంత మేర పరిస్థితి మెరుగుపడింది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అగ్ర దేశాలతోపాటు చిన్న చిన్న దేశాల్లోనూ ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 'కరోనా వైరస్' బారి నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నారు.
'కరోనా వైరస్'పై అవగాహనకు భారత చలనచిత్ర కళాకారులు నడుం బిగించారు. ఈ క్రమంలో బిగ్ బీ ఎంటర్టెయిన్మెంట్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ'ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు.
'కరోనా వైరస్'పై సామూహిక యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు ఆయన సందేశం ఇచ్చారు. కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా యుద్ధం చేయాలన్నారు. అలా జరిగితేనే వైరస్ లొంగి వస్తుందని స్పష్టం చేశారు.
'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు తారాలోకం దిగి వచ్చింది. ఇప్పటికే తెలుగు హీరోలు ఓ పాట విడుదల చేశారు. సినీ ప్రముఖులు ఎవరికి వారు సొంతంగా 'కరోనా వైరస్'పై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి .. అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది.
'కరోనా వైరస్'.. కారణంగా పేదవారి బతుకులు చిన్నాభిన్నంగా మారాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకవైపు.. మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతుందనే భయం. ఈ దెబ్బతో రెండు వైపులా పేద ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది.. అనేది పాత సామెత. సాధారణంగా ఈ సామెతను వయో వృద్ధులు వాడుతుంటారు. అంటే వయసు అయిపోయింది.. అన్నీ చూశాం.. ఇక చనిపోవడమే మిగిలి ఉందనేది దాని అర్థం. అంటే ఊరులో నుంచి ఊరి చివర ఉన్న వల్లకాడులోకి వెళ్లిపోతామని చెబుతుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది.
'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న వేళ.. అన్ని దేశాలు ఈ పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాయి. వేలకు వేల మంది కరోనా దెబ్బకు ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో చాలా దేశాలు కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి.. తమ ప్రజలను కాపాడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. కరోనా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. పోలీసులు 24 గంటలు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని స్వచ్ఛందంగా వైద్యం కోసం రావాలని కోరుతున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా రానిపక్షంలో వారి జాడ తెలుసుకుని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐతే పేదవారు, రోజూ కూలి పని చేసుకుని జీవితం గడిపే వారు ఇబ్బంది పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.