'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కాల్చిపారేయాలన్నారు.
'కరోనా వైరస్' తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్ బాధితుల సంఖ్య గుబులు పుట్టిస్తోంది. దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న 'కరోనా వైరస్'.. మరోవైపు ఎన్నెన్నో సిత్రాలకు కారణమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రముఖులు విరాళాలు సేకరిస్తున్నారు. పేద వారికి ఆహార, పానీయాలు అందిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 'కరోనా' అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనంలో దాదాపు 24 వందల మంది ఒకే చోట మత ప్రార్థనలు చేయడం... వారిలో 24 మందికి 'కరోనా వైరస్' పాజిటివ్ రావడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది.
'కరోనా వైరస్'పై అమెరికా యుద్ధం ప్రకటించింది. మహమ్మారిని ఎదుర్కునేందుకు ఇప్పటి వరకు ఏ దేశం చేయని విధంగా పౌరులకు పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా, ఇటలీని మించిన కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది.
'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ, సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు ఉద్యోగులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పేరు వింటేనే జనం ఒంట్లో నుంచి వణుకు పుడుతోంది.
మినాల్ దఖావే భోస్లే... ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమె పేరు నేటి నుంచి భారత దేశం మొత్తం మారు మోగి పోయింది. ఆమె ఎవరో కాదు.. భారత దేశంలో తొలిసారిగా 'కరోనా వైరస్' నిర్ధారించేందుకు టెస్ట్ కిట్ కనుక్కున్న అసాధారణ మహిళ.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు వింటేనే జనం గజగజా వణికిపోతున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30 వేల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. అన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తూ ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది. ఐతే వ్యాధి నిర్దారణకు ఆలస్యం కావడం ఇందులో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ ను త్వరగా గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేకపోవడమే కారణం.
'కరోనా వైరస్'.. అతి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటికే అన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది.
మీ కోసమే చెబుతున్నాం.. మీ మంచి కోసమే చెబుతున్నాం.. అని ఎంత చెప్పినా.. జనం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులకు లాఠీ ఝుళిపించాల్సిన బాధ తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో పోలీసులకు పౌరులకు మధ్య ఈ విషయం గురించి ఓ యుద్ధమే జరుగుతోంది.
'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనాన్ని ఇళ్లలోనే ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 32 ఏళ్లనాటి రామయణ, మహాభారత టీవీ సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తోంది.
ఆ పేదవారికి ఎంత ఎంత కష్టం. కరోనా వైరస్ దెబ్బకు వారి జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయి. వందలకొద్దీ కిలోమీటర్లు కాలి నడకనే వెళ్లే పరిస్థితి దాపురించింది.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో కరీంనగర్ కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే .. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో కోవిడ్ 19 విస్తృతి ఎక్కువగా ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎక్కడికక్కడ లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజు వరకు 649 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మున్ముందు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఐతే లాక్ డౌన్ వేళ పేద ప్రజల సంగతేంటి..? వారు ఆకలితో అలమటించాల్సిందేనా..? ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ పరిష్కారం చూపించింది.
'కరోనా వైరస్' వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. భారత దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 649కి చేరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.