తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దిశ గ్యాంగ్ రేప్, హత్య కేసు నుంచి ఆమె తల్లిదండ్రులు కోలుకోలేకపోతున్నారు. తల్లి రోజూ ఏడుస్తునే ఉందని దిశ తండ్రి మీడియాకు తెలిపారు.
నిర్భయ కేసును త్వరితగతిన విచారణ చేపట్టి దోషులకు ఆరు నెలల్లోగా శిక్ష అమలు చేసి ఉంటే బాగుండేదని, దిశ తండ్రి అభిప్రాయపడ్డారు. అలాకాని పక్షంలో ఎన్ కౌంటర్ మంచిదని అంతా భావించే అవకాశం ఉందన్నారు.
మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది. నిందితులను 6 నెలల్లోనే శిక్షించేలా కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలని స్వాతి మాలివాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దిశ అత్యాచారం, హత్య తరువాత జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోసం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ పోలీసులు మంచి నిర్ణయం తీసుకుని అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని వారికి మాయావతి వారికి చురకలంటించారు.
దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ ఘటనపై నిర్భయ తల్లి స్పందించారు. దిశ కేసులో ఆమె తల్లిదండ్రులకు ఏడు రోజుల్లోనే న్యాయం లభించడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తంచేశారు.
దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్‌లను ఎన్కౌంటర్లో మట్టుపెట్టడంపై సాధారణ ప్రజానికంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.
దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే.
దిశ ఘటనలో సత్వర న్యాయం జరగాలని ప్రపంచమంతా ఒకవైపు నిలబడి పోరాడుతోంటే.. మరోవైపు మహిళలను అవమానించే రీతిలో వారిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు డానియెల్ శ్రావణ్ అనే ఓ సినీ దర్శకుడు. మహిళలు తమ వెంట కండోమ్స్ ఉంచుకోవాలని.. అత్యాచార ఘటనల్లో రేపిస్టులకు సహకరిస్తే.. వారు హత్యల నుంచి తప్పించుకోవచ్చంటూ డానియెల్ శ్రవణ్ ఇచ్చిన ఓ దరిద్రపుగొట్టు సలహా అతడి నీచ మనస్తత్వాన్ని బయటపెట్టింది.
స్వాతి మలివాల్ దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
దిశపై అత్యాచారం, దారుణ హత్య ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఘటన విషయంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన తీరుతో పాటు పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి.
దేశవ్యాప్తంగా అలజడి రేపిన హైదరాబాద్ దిశ అత్యాచార ఘటనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. దిశపై అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండించిన రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని అన్నారు.
దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు భయం గొలిపేలా ఉన్నాయి. పైశాచిక ఆనందం పొందడానికి నిందితులు ఏ స్థాయికి దిగజారారో.. ఎంత కృూరంగా ప్రవర్తించారో వింటుంటేనే ఒక్కొక్కరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.