పార్లమెంట్‌ను కుదిపేసిన దిశ అత్యాచారం, హత్య కేసు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపిన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు నేడు ఉభయ సభల్లో ప్రధాన చర్చనియాంశంగా మారింది.

Updated: Dec 2, 2019, 03:10 PM IST
పార్లమెంట్‌ను కుదిపేసిన దిశ అత్యాచారం, హత్య కేసు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపిన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు నేడు ఉభయ సభల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పార్టీలకతీతంగా అన్ని పార్టీలు నేతలు దిశ అత్యాచారం, దారుణ హత్య కేసు అంశాన్ని లేవనెత్తడంతో ఈ అంశం పార్లమెంట్‌ని కుదిపేసింది. దీనిపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు అనుమతివ్వగా.. మరోవైపు పార్టీలకతీతంగా అన్ని పార్టీల సభ్యులు మాట్లాడుతూ దిశ హత్యా నేరాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు. సభ ఆరంభమవ్వగానే బీజేపీ సభ్యులు ప్రభాత్ ఝా మాట్లాడుతూ " షాద్ నగర్ హత్యోదంతంతో పాటు మహిళలపై అత్యాచారంపై చర్చించేందుకు నోటీసు ఇచ్చారు. 

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ సైతం "మహిళలపై పెరుగుతున్న నేరాలు, హద్రాబాద్ ఘటన అంశాలపై రూల్ 267 ప్రకారం బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చారు. ఇదే అంశంపై సభలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి.