కొనసాగుతున్న స్వాతి మాలివాల్ ఆమరణ నిరాహార దీక్ష

మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది. నిందితులను 6 నెలల్లోనే శిక్షించేలా కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలని స్వాతి మాలివాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Last Updated : Dec 12, 2019, 07:50 PM IST
కొనసాగుతున్న స్వాతి మాలివాల్ ఆమరణ నిరాహార దీక్ష

న్యూఢిల్లీ: మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది. నిందితులను 6 నెలల్లోనే శిక్షించేలా కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలని స్వాతి మాలివాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తన డిమాండ్లపై కేంద్రం స్పందించడం లేదని, పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. డిమాండ్లు పరిష్కారం  అయ్యేవరకు, నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్వాతి మాలివాల్ స్పష్టంచేశారు. 

కేంద్రం నిర్భయ నిధిని నిరుపయోగంగా ఉంచిందని, వెంటనే ఆ నిధిని వినియోగంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. నవంబర్ 28న షాద్ నగర్ వద్ద జరిగిన దిశ హత్యోదంతం గురించి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిరాహార దీక్ష చేపట్టిన స్వాతి మాలివాల్.. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నేరాలను అరికట్టేలా కఠినమైన చట్టాలు రావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

Trending News