Diwali Celebrations: దీపావళి సంబరాలపై న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పండుగ జరుపుకునేందుకు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే ఇచ్చింది. ఫలితంగా కేవలం 2 గంటలే దీపావళి టపాసులు పేల్చుకునేందుకు అనుమతి లభించింది.
దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
AP Govt decision on Diwali crackers | కరోనా వ్యాప్తి సమయంలో దీపావళి టపాసులు, సంబరాలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దీపావళి టపాసులపై కీలక నిర్ణయం తీసుకుంది. రోజులో కేవలం రెండు గంటలపాటు టపాసులు పేల్చడానికి ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది.
ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు విధించి షుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నుంచి తేరుకోకముందే పంజాబ్ హర్యాన హైకోర్టు మరోషాకిచ్చింది. దీపావళి పండగ రోజు టపాసులు కాల్పేందుకు సమయపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రజలకు సూచించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
కృష్ణా, గోదావరి నదుల సంగమ స్థలిలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 17, 18వ తేదీలలో పవిత్ర హారతులు, అరవై అడుగుల నరకాసుర వధ, సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు, పెద్ద ఎత్తున బాణాసంచాలతో సంబరాలు చేయనుంది. ఈ వేడుకలను తిలకించటానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా హాజరుకావచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ వారు సంయుక్తంగా ఈ సంబరాలను అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణా, గోదావరి నదుల సంగమ స్థలి.. పవిత్ర సంగమం వద్ద నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.