గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని పటేళ్ల వర్గం నాయకుడు హార్ధిక పటేల్ ఆరోపించారు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుత సమాచారం బట్టి అక్కడ బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ పలు ఆరోపణలు చేశారు.ఈవీఎంల ట్యాంపరింగ్ పై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దాటి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 92కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఐదో రౌండ్ ఫలితాల వరకూ విజయలక్ష్మి దోబూచులాడుతుండటంతో కాస్తంత ఆందోళనగా కనిపించిన బీజేపీ శ్రేణులు, ఆపై ఫలితాల సరళి తమకు అనుకూలంగా మారడంతో గాంధీనగర్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం మొదలైంది. ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలోనూ సంబరాలు ప్రారంభమయ్యాయి.
గుజరాత్ కౌంటింగ్ ట్రెండ్ క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠతను రేపుతున్నాయి. విజయం కాంగ్రెస్-బీజేపీల మధ్య దోబూచులాడోంది. ఆరంభంలో బీజేపీ వైపు ఉండగా..తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లింది..ఇంతలోనే మళ్లీ బీజేపీ వైపు మళ్లీంది. ప్రస్తుతం బీజేపీ 105 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే, గుజరాత్ లో హోరాహోరీ పోరు జరిగిందనే విషయం అర్థమవుతోంది.
గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాగా ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన గంటా.. రెండు గంటల్లోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిందీ తెలిసిపోతుంది.కాగా హిమాచల్ ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.