Munugode Bypoll: బీజేపీ కావాలని తనపై సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తను బీజేపీలోకి చేరుతున్నారని తప్పు వార్తాలు క్రియోట్ చేస్తున్నారన్నారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక మరికొన్ని గంటలే ఉండటంతో ప్రలోభాల పర్వం తార స్థాయికి చేరింది. ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదు పెద్ద మొత్తంలో పట్టుపడుతుండటం కలకం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద AP 09 CA 3339 స్కార్పియో వాహనంలో భారీగా నగదు దొరికింది.
Munugode ByElection : తెలంగాణలో రాజకీయ వేడి పుట్టించిన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈక్రమంలో ప్రధాన పార్టీలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటున్నారు.
Munugode ByElection : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల్లో ప్రచారాన్ని పెంచాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చే నెల 1న సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.
Munugode Bypoll: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడిపోతున్నారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు..
Munugode Bypoll: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. కొంత మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు. తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న భయంతో వాళ్లకు నిద్ర రావడం లేదట.
Munugode Bypoll: మాజీ ఎంపీ బూర నర్సయ్య ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరనున్నారు. బూర నర్సయ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. చండూరు మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ కావాలనే కుట్రతో కారును పోలిన గుర్తులను కేటాయించిందని ఆరోపించారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు.
Munugode Bypoll: ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉన్న బూర.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.