ICC rankings: టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 27 స్థానాలు ఎగబాకగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయాడు.
IND vs SL 3rd T20: భారత్ తన దూకుడును చివరి టీ20లోనూ కొనసాగించింది. ఫలితంగా సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
India beat Sri Lanka in 1st T20: లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 62 పరుగుల తేడాతో గెలుపొందింది.
India vs Sri Lanka 1st T20: లక్నో వేదికగా లంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసి.. శ్రీలంక ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
IND vs WI 3rd T20 Toss: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Shreyas Iyer: టీమ్ ఇండియాలో స్థానం దక్కడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. లేకపోతే మరో వ్యక్తి ఆ అవకాశాన్ని తన్నుకుపోగలడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది.
IPL 2022 mega auction: ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 టీమ్స్ మొత్తం 204 ప్లేయర్స్‌ను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.551 కోట్లు వెచ్చించాయి. మరి ఆ సారి టాప్ 10లో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ ఎవరో చూసేద్దామా!
KKR Shreyas Iyer: భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్ 2022 వేలంలో భారీ ధర పలికాడు. మార్కీ (అత్యంత ముఖ్యమైన) జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది.
IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది.
IND vs WI 3rd ODI: మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచులో భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది.
Dhawan, Shreyas and Ruturaj Gaikwad test positive for Covid 19: వెస్టిండీస్‌తో జరగనున్న పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు.
IPL 2022: ఐపీఎల్ 2022లో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వివిద టీమ్ ఆటగాళ్లే కాదు..కెప్టెన్స్ కూడా మారనున్నారు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు సైతం కెప్టెన్సీ మార్పుపై ఆలోచన చేస్తోంది. ఇతర టీమ్ ఆటగాళ్లపై కన్నేసింది.
మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియా ఆటగాళ్లు రోహిత్, శ్రేయస్, శార్దుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రేయస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
కాన్పూర్ టెస్టులో అరంగేట్రం చేసిన తర్వాత శ్రేయాస్ టెస్ట్ క్రికెట్ ఆడాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వల్లే క్రికెట్ ఆడుతున్నానని శ్రేయాస్ చెప్పాడు.
ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిల్యాండ్ 57 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ స్కోరుకు కివీస్ 216 పరుగులు వెనకబడి ఉంది.
IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.