Revanth Reddy to be next PCC chief ? : హైదరాబాద్: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశాలు ఉన్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందనే వార్తలు రావడం ఇవాళ కొత్త కాదు... కాకపోతే ప్రస్తుతం పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించిన నేపథ్యంలో మరోసారి ఈ ప్రచారం తెరపైకొచ్చింది.
Gulam Nabi Azad Comments On Congress Party Leadership | కాంగ్రెస్ పార్టీలో లోపాలను ఎత్తిచూపుతూ పార్టీ ప్రక్షాళన అంశంపై సోనియాకు ఘాటు లేఖ రాసిన 23 మంది నేతలలో ఒకరైన గులాం నబీ ఆజాద్ పార్టీలో అంతర్గత వ్యవహారాలను తప్పుపట్టారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశం వాడీవేడీగా కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ ఆగ్రహం (Rahul Gandhi Comments At CWC) వ్యక్తం చేశారు.
నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi On Rajiv Gandhi Birth Anniversary) నివాళులర్పించారు.
రాజస్థాన్ సంక్షోభం సమసినట్టే కన్పిస్తోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టుగా తెలుస్తోంది. సచిన్ పైలట్ వ్యాఖ్యలే దీనికి కారణం. ఐదేళ్ల కోసం కష్టపడి ప్రభుత్వం ఏర్పరిచామని సచిన్ వ్యాఖ్యానించడమే దీనికి కారణం.
గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెగ్యూలర్ హెల్త్ చెకప్‌లో భాగంగానే Sonia Gandhi ఆస్పత్రిలో చేరారని సీనియర్ డాక్టర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో చేరారు ( Sonia Gandhi Admitted to Hospital).
సచిన్ పైలట్ ( Sachin Pilot ) . ఇప్పుడీ పేరు చుట్టే మొత్తం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ( Rajasthan Government ) సంక్షోభం వైపుకు వెళ్తుండటానికి కారణం ఈ పేరే. రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్సెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వివాదానికి కారణమేంటి ? సచిన్ పైలట్ నేపధ్యమేంటి ?
రాజస్థాన్ కాంగ్రెస్ (Congress) లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య వైరం తారస్థాయికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
Rajya Sabha election రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్లో ( Gujarat ) మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్ ( Akshay Patel ), జీతూ భాయ్ చౌదరి ( Jitu Bhai Chaudhary ) తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి లేఖలు పంపారు.
ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ( Atma nirbhar package ) పేరుతో ప్రధాని మోదీ సర్కార్ ( PM Modi govt ) ప్రవేశపెట్టిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ( Rs 20 lakh crore package ), ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) ఐదు రోజులపాటు ఆ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడించడాన్ని దేశంపై ఓ కృూరమైన జోక్‌గా ( Cruel joke ) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ) అభివర్ణించారు.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.
మీడియా రంగానికి ప్రభుత్వ పరమైన ప్రకటనలు నిలిపివేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచనపై ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) తీవ్రమైన నిరసన వ్యక్తం చేసింది. సోనియా గాంధీ ప్రతిపాదన సహేతుకమైనది కాదని,
కరోనా వైరస్ నివారణ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు.అప్పుడే దేశం కరోనావైరస్పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టంచేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus) చెందకుండా ఉండేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ (Lockdown) విధానంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ పరీక్షల్లో నిమగ్నమైన సిబ్బందికి, కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సరైన కరోనా సోకకుండా సరైన సదుపాయాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.