Hardik Patel: హార్దిక్ పటేల్‌కు కీలక బాధ్యతలు

గుజరాత్‌లో పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చిన యువ నాయకుడు హార్దిక్ పటేల్‌కు కాంగ్రెస్‌ కీలక బాధ్యతలను అప్పగించింది.

Last Updated : Jul 11, 2020, 10:14 PM IST
Hardik Patel: హార్దిక్ పటేల్‌కు కీలక బాధ్యతలు

Gujarat politics: న్యూఢిల్లీ: గుజరాత్‌లో పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చిన యువ నాయకుడు హార్దిక్ పటేల్ ( Hardik Patel ) ‌కు కాంగ్రెస్ (Congress)‌ కీలక బాధ్యతలను అప్పగించింది. శనివారం గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హార్దిక్ పటేల్ నియామకాన్ని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ (KC Venugopal) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.  Also read: PM cares Fund: ఆ వివరాలు ఎందుకు చెప్పరు: రాహుల్ గాంధీ

 

అయితే.. 2015లో గుజరాత్‌లో జరిగిన పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమానికి  హార్దిక్ పటేల్ నాయకత్వం వహించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో హార్దిక్ పటేల్ 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బయటనుంచి మద్దతు తెలిపారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ జామ్‌నగర్ స్థానానికి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చింది. అయితే పాత అల్లర్ల కేసు వెంటాడటంతో ఆయన పోటీ చేయలేకపోయారు. Also read: Encounter Effect: నేను బండెక్కను..యూపీ నేరస్థుడి రిక్వెక్ట్ 

Trending News