Victory Venkatest Latest Movie Narappa | తమిళంలో హీరో ధనుష్ నటించిన చిత్రం అసురన్ తెలుగులో రీమేక్ నారప్ప మూవీగా వస్తోంది. విక్టరీ వెంకటేష్ నటించిన తాజాగా సినిమా నారప్ప(Narappa Movie)పై కరోనా ప్రభావం పడింది. సినిమా విడుదల వాయిదా వేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది.
తమిళంలో ధనుష్ నటించిన అసురన్ అనే హిట్ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న నారప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అభిమానులకు, ఆడియెన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విక్టరీ వెంకటేష్, రానాదగ్గుబాటి కలిసి ఎప్పుడూ నటించలేదు. ఆ రోజు వస్తుందేమో అని చాలాకాలం నుంచి సినీ ప్రేమికులు వేచి చూస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చినా ఫుల్ లెంత్ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని అభిమానులు వేచి చూస్తున్నారు.
ఇటీవలే పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) అప్పుడే బాధ్యతలు సైతం ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ అప్డేట్స్ ప్రకారం రానా దగ్గుబాటికి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌కి ( Suresh Productions ) సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
'లండన్ బాబులు' సినిమా ఫేమ్ రక్షిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పలాస 1978'. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు.
'వెంకీ మామ'తో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళంలో హీరో ధనుష్ నటించిన చిత్రం అసురన్ కు ఇది తెలుగులో రీమేక్ గా వస్తోంది.
రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచే రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కి చెందిన కార్యాలయాలు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నివాసంతో పాటు ఇతర ప్రదేశాలను కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.