Narappa sankranti poster: నారప్ప సంక్రాంతి పోస్టర్ వైరల్

తమిళంలో ధనుష్ నటించిన అసురన్ అనే హిట్ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న నారప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అభిమానులకు, ఆడియెన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Last Updated : Jan 15, 2021, 01:25 AM IST
Narappa sankranti poster: నారప్ప సంక్రాంతి పోస్టర్ వైరల్

తమిళంలో ధనుష్ నటించిన అసురన్ అనే హిట్ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న నారప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అభిమానులకు, ఆడియెన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. 

Also read : Vakeel Saab Teaser: వకీల్ సాబ్ టీజర్ అదుర్స్

తమిళనాడులోనే 60% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా అకస్మాత్తుగా ఆగిపోయింది. తాజా విషయం ఏంటంటే, వెంకటేష్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నాడు. నారప్ప మూవీలో ( Narappa movie ) వెంకీ సరసన ప్రియామణి జంటగా నటించింది. సురేష్ బాబు తన హోమ్ బ్యానర్‌లో నారప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే వెంకీ ( Venkatesh ) 60వ బర్త్ డే సందర్భంగా విడుదలైన ప్రోమో వీడియోకు సైతం భారీ స్పందన లభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News