Telugu Language: అత్యంత వేగంగా విస్తరిస్తున్న తెలుగు భాష, అమెరికాలో అగ్రభాషగా తెలుగు

Telugu Language: దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు ఏ సందర్భాన చెప్పారో కానీ..అదే ప్రతిబింబిస్తోంది. ఖండాలు దాటి మరీ తెలుగు భాష ఖ్యాతి విస్తరిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో అగ్రభాషగా ఎదుగుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 19, 2022, 06:46 PM IST
Telugu Language: అత్యంత వేగంగా విస్తరిస్తున్న తెలుగు భాష, అమెరికాలో అగ్రభాషగా తెలుగు

తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను..శ్రీ కృష్ణదేవరాయలి మాటలు అక్షరసత్యాలవుతున్నాయి. తెలుగు భాష ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఎల్లలు దాటి మరీ తెలుగు లెస్స అంటోంది. అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భాషగా ప్రాచుర్యం పొందింది. ఆ వివరాలు మీ కోసం..

తెలుగు నేల నుంచి అగ్రరాజ్యం అమెరికాకు సాగిన భాషా పయనమిది. అగ్రరాజ్యంలో ఇప్పుడు తెలుగు భాష అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాషగా ప్రాచుర్యం పొందుతోంది. అమెరికన్ థింక్ ట్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం..7-8 సంవత్సరాల క్రితం తెలుగు 86 శాతం పెరగగా.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన ఆన్‌లైన్ వీడియో ప్రకారం కూడా..తెలుగు మాట్లాడే అమెరికన్ రెసిడెంట్స్ సంఖ్య 85 శాతం వరకూ పెరిగింది.

తెలుగు భాష ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన అధికారిక భాషైన తెలుగు మాట్లాడేవారి సంఖ్య 84 మిలియన్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా మాట్లాడే నాలుగవ భాషగా ఉంది. అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న పది భాషల్లో ఏడు భాషలు దక్షిణ ఆసియా ప్రాంతానికి చెందినవే కావడం విశేషం.

తెలుగు భాష ఎలా విస్తరించింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ పెరగడంతో యూఎస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ వరకూ తెలుగు మాట్లాడేవారి ప్రయాణం కొనసాగింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1000 వరకూ ఇంజనీరింగ్ కళాశాలలుండటం కూడా మరో కారణం. ఈ పదేళ్ల కాలంలో తెలుగు మాట్లాడే అమెరికన్లు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఏపీ, తెలంగాణ నుంచే హైర్ చేసుకుంటున్నారు.

ఇక మరో ముఖ్యకారణం కూడా ఉంది. తెలుగు భాష మాట్లాడేవారి ఇంగ్లీష్ ఉఛ్ఛారణ..ఇతర భాషా ప్రజల కంటే బాగుంటుందనేది ఓ సర్వేలో తేలిన విషయం.

తెలుగు భాష స్థానమెక్కడ

అమెరికాలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య 2010-2017 మధ్యకాలంలో  86 శాతం పెరగగా..బెంగాలీ భాష 58 శాతం పెరుగుదలతో రెండవ స్థానంలో నిలిచింది. అటు తమిళం 55 శాతంతో ఉంది. అరబిక్, హిందీ భాషలు 42 శాతంతో ఉన్నాయి. 2021 నాటికి తెలుగు మాట్లాడేవారు 150 శాతం పెరిగారు. అటు అరబిక్ 62 శాతంతో రెండవస్థానంలో ఉంటే..61 శాతంతో హిందీ మూడవ స్థానంలో నిలిచింది. ఇక 45 శాతంతో ఉర్దూ నాలుగవ స్థానంలో ఉంది. 

ఐదేళ్ల క్రితం 86 శాతం పెరుగుదల నమోదు చేసిన తెలుగు భాష..ఈ ఐదేళ్లలో ఏకంగా 150 శాతానికి పెరిగింది. అంటే దాదాపు రెట్టింపైంది. అటు అరబిక్ భాష కూడా వేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో ఇంగ్లీషు తరువాత అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాషలుగా తెలుగు, అరబిక్ నిలుస్తున్నాయి. అందుకే దేశ భాషలందు తెలుగే లెస్స అని చెప్పుకోవచ్చు.

Also read: High-protein Side Effects: అతిగా హై ప్రోటిన్స్‌ కలిగి ఆహారాలు తీసుకుంటే అంతే సంగతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News