భారత దేశంలో తొలి లవ్ జిహాద్ కేసు బరేలి జిల్లాలో నమోదు అయింది. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన Prohibition of Unlawful Conversion of Religion Ordinance, 2020 ప్రకారం డియోరానియా పోలీస్టేషన్లో ఆదివారం ఒక కేసు నమోదు చేశారు.
లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో లవ్ జిహాద్ వంటి మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేపట్టింది. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టేందుకు కఠినమైన చట్టాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. సిట్ (SIT), సీబీఐ (CBI) కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్రాస్ బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు రక్షణగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కూడా అప్పగించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ ( Hathras incident) సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి అర్థరాత్రి బలవంతంగా దహనసంస్కారాలు (Hathras victims cremation ) నిర్వహించడంపై ప్రజలు, విపక్షాలు.. యూపీ పోలీసులు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ( UP Govt) అర్థరాత్రి దహన సంస్కారాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో సుప్రీంకోర్టు (Supreme Court ) కు వివరించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దుర్మార్గపు ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆతర్వాత బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతించకుండా పోలీసులే అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. సెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక (Gang Rape) అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రతీరోజు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం దీనిబారిన పడి బలవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.