AP Budget session 2020 | అమరావతి: ఏపీ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై ( TDP protest over Atchannaidu arrest) తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అధికార పక్షమైన వైఎస్సార్సీపీకి, ప్రతిపక్షమైన టీడీపీకి ( YSRCP vs TDP) మధ్య మాటల యుద్ధమే నడించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తర్జనభర్జనలు జరుగుతుండగానే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన చర్చనియాంశమైంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న అమరావతిని చట్టసభలకు రాజధానిగా, ప్రభుత్వ కార్యకలాపాల కోసం విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.