Affordable Room Heater 2024: భారతదేశ వ్యాప్తంగా శీతకాలం ప్రరంభమైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. దీని కారణంగా సాయంత్రం 7 అయ్యందంటే చాలు.. ప్రజలు చలి కారణంగా బయటకు రావడం మానేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని నార్త్ ప్రాంతాల్లోనైతే.. దట్టమైన పొగ మంచుకూడా కురుస్తోంది. ఈ సమయంలో శరీరానికి వెచ్చదనం అందించడం చాలా ముఖ్యం లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా మంది రూమ్ హీటర్స్ పెట్టుకుంటూ ఉంటారు. దీని కారణంగా శరీరం ఎప్పుడూ వెచ్చదనంగా ఉంటుంది. అలాగే గదిలోకి చలి కూడా రాకుండా ఉంటుంది. క్రమ క్రమంగా ఈ హీటర్స్ విక్రయాలు జోరుగా పెరుగుతున్నాయి. దీని కారణంగా అనేక ఎలక్ట్రిక్ బ్రాండ్స్ ఈ రూమ్ హీటర్స్‌ను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే మీరు కూడా రూమ్ హీటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ ధరలోనే.. ఈ రోజు అతి తక్కువ ధరలో లభించే కొన్ని రూమ్ హీటర్స్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలా కంపెనీలు రూ.2000కే రూమ్ హీటర్స్‌ను విక్రయిస్తున్నాయి. చాలా మంది ఇవి చౌకగా ఉన్నాయి.. సరిగ్గా పని చేయకపోవచ్చు అనుకుంటారు. నిజానికి ఇవి పెద్ద పెద్ద గదులను కూడా హీట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. అతి తక్కువ ధరలో లభించే కొన్ని రూమ్ హీటర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఓర్పాట్ OEH-1220 2000-వాట్ ఫ్యాన్ హీటర్:
అతి తక్కువ ధరలో లభించే రూమ్ హీటర్స్‌లో ఓర్పాట్ OEH-1220 2000-వాట్ ఫ్యాన్ హీటర్ ఒకటి. ఇది చిన్న గదుల నుంచి పెద్ద గదుల వరకు అన్నింటిని వెచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది 2000-వాట్ హీట్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీని ద్వారా గదులన్నీ ఒక్కసారిగా వెచ్చగా మారుతుంది. అలాగే ఇది నాయిస్ లేకుండా పని చేస్తుంది. అలాగే ఇందులో అనేక రకాల ఫీచర్స్ కూడా లభిస్తాయి.
బోరోసిల్ 2000W నోవస్ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ రూమ్ హీటర్:
ప్రస్తుతం బోరోసిల్ 2000W నోవస్ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ రూమ్ హీటర్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇది గదిలో ఉష్ణోగ్రత నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది 1-సంవత్సరం వారంటీతో కేవలం రూ.1,399కే లభిస్తోంది. అలాగే శీతాకాలం సందర్భంగా ఈ హీటర్‌పై ఏకంగా 41 శాతం వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
ఉషా 2 రాడ్ 800 వాట్ క్వార్ట్జ్ హీటర్:
ప్రస్తుతం ఉషా 2 రాడ్ 800 వాట్ క్వార్ట్జ్ హీటర్ అత్యంత శక్తివంతమై ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇది 800-వాట్ల శక్తితో అందుబాటులో ఉంది. అలాగే ఇది రెండు హీటింగ్ పొజిషన్‌లను కలిగి ఉంటుంది. కాబట్టి సులభంగా రూమ్‌ను వేడి గాలితో నింపేస్తుంది. ప్రస్తుతం ఈ రూమ్ హీటర్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.