Airtel 799 Plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఒక ప్లాన్‌తో రెండు కనెక్షన్లు, ఫ్రీ ఓటీటీ

Airtel 799 plan: కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ , రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ ఇప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 09:01 AM IST
Airtel 799 Plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఒక ప్లాన్‌తో రెండు కనెక్షన్లు, ఫ్రీ ఓటీటీ

Airtel 799 Plan: ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రారంభమైంది. ఈ కొత్త ప్లాన్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లు రెండు కనెక్షన్లు పొందుతారు. అంటే ఒక ప్లాన్‌తో రెండు కనెక్షన్లు వస్తాయి. ఆశ్చర్యంగా ఉందా.. కానీ నిజమే. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ ప్రారంభించిన కొత్త రీఛార్జ్ ప్లాన్ పేరు ఎయిర్‌టెల్ బ్లాక్. ఇందులో సాధారణ సిమ్, యాడ్ ఆన్ సిమ్ ఉంటాయి. వినియోగదారులకు 104 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టిడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్నవారికి 260  రూపాయల విలువైన టీవీ ఛానెల్‌తో పాటు డీటీహెచ్ కనెక్షన్ కూడా లభిస్తుంది. రీఛార్జ్ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ బ్లాక్ కింద అనేక ఇత ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎయిర్‌టెల్ 1099,1599,2299,998,1799,700 ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లో భాగంగా మీరొక్కరే కాకండా కుటుంబసభ్యులు, స్నేహితుల సేవల్ని కూడా ఒకే బిల్లు కిందకు తీసుకొచ్చేందుకు కంపెనీ అనుమతిస్తుంది. 

ఎయిర్‌టెల్ ఇటీవలే తన వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్ 5జి డేటా ప్రారంభించింది. కొత్త ప్లాన్ ప్రకారం డేటా వినియోగంపై ఉన్న పరిమితి తొలగించింది. ఈ ప్లాన్స్‌తో పాటు ఎయిర్‌టెల్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 

Also Read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Also Read: Rolls Royce Cullinan Black Badge: షారుఖ్ వద్ద ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News