Amazon smartwatch offers: స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్, 10 వేల వాచ్ కేవలం 2 వేలకే

Amazon smartwatch offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో ఇంకా అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. దసరా, దీపావళి సీజన్ ముగిసినా డిస్కౌంట్ ఆఫర్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2022, 04:40 PM IST
Amazon smartwatch offers: స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్, 10 వేల వాచ్ కేవలం 2 వేలకే

మొన్నటి వరకూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేదికల్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అమెజాన్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం.

అమెజాన్ ఈ కామర్స్ వేదిక ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌లను ఇప్పుడు కేవలం 2 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా ఐదు బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌లు అమెజాన్‌లో డిస్కౌంట్ లో ఉన్నాయి. ఇందులో మొదటిది ఫైర్ బోల్డ్ ఫోనిక్స్ స్మార్ట్‌వాచ్. ఈ వాచ్‌పై అమెజాన్‌లో 80 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ వాచ్ అసలు దర 9,999 రూపాయలు కాగా, ఇప్పుడు కేవలం 1999 రూపాయకే పొందవచ్చు. ఇందులో 1.3 అంగుళాల డిస్‌ప్లే, 120 స్పోర్ట్స్ మోడ్స్ , బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‌పీఓ2, ఐపీ 67 రేటింగ్ వంటి అధునాతన ఫీచర్లున్నాయి.

ఇక రెండవది బోట్ వేవ్ కాల్ స్మార్ట్‌వాచ్. ఈ స్మార్ట్‌వాచ్ అసలు ధర 7,990 రూపాయలు కాగా, అమెజాన్‌లో 1999 రూపాయలు లభిస్తోంది. ఇందులో 1.69 అంగుళాల స్క్వేర్ డిస్‌ప్లే, 150 వాచ్ ఫేసెస్, హార్ట్ మానిటరింగ్ రేట్, ఎస్‌పిఓ 2 ఫీచర్లున్నాయి. మూడవది నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్‌వాచ్. ఈ స్మార్ట్‌వాచ్ అసలు ధర 3,999 రూపాయలు కాగా, కేవలం 1699 రూపాయలకే తీసుకెళ్లవచ్చు. ఇందులో ఐపీ 68 రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఎస్‌పీఓ 2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ ఉన్నాయి. 

ఇక నాలుగవది బోట్ వేవ్ లైఫ్ స్మార్ట్‌వాచ్. అసలు ధర 6,990 రూపాయలు కాగా, అమెజాన్‌లో 1499 రూపాయలకు లభ్యమౌతోంది. ఇందులో బ్యాటరీ లైఫ్ 7 రోజుల వరకూ ఉంటుంది. ఇక ఐదవది జెబ్రానిక్స్ జెబ్ ఫిట్ 3220 సీహెచ్ స్మార్ట్‌వాచ్. అసలు ధర 5449 రూపాయలు కాగా, అమెజాన్‌లో 1499 రూపాయలు పొందవచ్చు. ఇందులో ఎస్‌పీవో 2, బీపీ, హార్ట్ రేట్ మానిటరింగ్, ఐపీ 68 రేటింగ్, రౌండ్ డయల్, మెటల్ బిల్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇక చివరిగా గార్మిన్ ఫెనిక్స్ 7 సిరీస్ స్మార్ట్‌వాచ్. అసలు ధర లక్ష రూపాయలు పైమాటే. ఈ స్మార్ట్‌వాచ్‌పై 11 వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు. 

Also read: Airtel 199 Plan: ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News