Get Apple iPhone 11 @ Rs 8,950: 2020 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్స్‌లో యాపిల్ ఐఫోన్ 11 మొబైల్ ఒకటి..ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందిన ప్రత్యేక మోడల్స్‌లో ఇది ఒకటి. యాపిల్ iPhone 14 సిరీస్ ప్రారంభించిన తర్వాత మార్కెట్‌లో ఐఫోన్ 11 అమ్మకాలను నిపివేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా రకాల ప్రత్యేక ఫీచర్లు ఉండడంతో చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ మోడల్ విడుదలైన తర్వాత ఐఫోన్ 11 ప్రో కూడా అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ సిరీస్ మొబైల్స్ మార్కెట్‌లోకి రూ. 64,900 ధరలో వచ్చాయి. మార్కెట్‌లో సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ధరల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ మొబైల్స్ ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తున్నారు. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 32,049 తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా అన్ని ఆఫర్లు పోను ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 8,950కి లభిస్తోంది. అయితే ఎలా కొనుగోలు చేస్తే డెడ్ ఛీప్‌గా ఈ మొబైల్‌ను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Samsung Galaxy F54 5G: శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫోన్ ఫీచర్స్ చూశారా ?
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 11 ధర రూ 40,999 ఉండగా..ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన బ్యాంక్‌లతో కొనుగోలు చేస్తే రూ. 2,901 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 38,950 అవుతుంది. ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు 30,000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో అన్ని ఆఫర్లు పోను దాదాపు ఈ యాపిల్ 11ను రూ.8,950లకే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ 11 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది A13 బయోనిక్ చిప్‌సెట్‌తో లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ 12MP సెన్సార్లు కలిగి ఉంటుంది. దీంతో ఫోటోలను చిత్రికరించడం చాలా సులభంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి