Bike running On Water Instead Of Petrol: పెట్రోల్‌తో బైక్ నడుస్తుందని మనందరికీ తెలుసు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. గ్యాస్, కరెంట్ ఛార్జింగ్‌తో నడిచే బైక్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్స్ హవా నడుస్తోంది. వీటన్నింటిని మనం డ్రైవ్ చేసే ఉంటాం. అయితే నీళ్లతో నడిచే బైక్ కూడా ఉంది. చర్యపోకండి.. మీరు చూస్తుంది నిజమే. వాస్తవానికి బైక్‌ను నీటితో మాత్రమే నడపలేము.. నీటితో రసాయన చర్య చేయడం ద్వారా బైక్ రన్ అవుతుంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాల్షియం కార్బైడ్‌ను నీటిలో కలిపినప్పుడు ఏర్పడే రసాయన చర్య వల్ల ఎసిటిలీన్ వాయువు విడుదలవుతుందని యూట్యూబ్ వీడియోలో వ్యక్తి చెప్పాడు. ఎసిటిలీన్ వాయువు అగ్నిని తాకినప్పుడు వేగంగా కాలిపోతుంది. దాంతో బైక్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వీడియో ప్రకారం.. ఓ యువకుడు బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను పూర్తిగా తీసేసాడు. ట్యాంక్ నిండా నీళ్లు పోశాడు. ఆపై కుక్కర్‌లో కాస్త కాల్షియం కార్బైడ్ వేశాడు. ఆపై కుక్కర్‌లో నీళ్లు పోసి మోతపెట్టాడు. కుక్కర్ పైభాగంలో గ్యాస్ బయటకు వచ్చే చోట IV సెట్‌ను ఏర్పాటు చేశారు. IV సెట్ యొక్క మరొక చివరలో ఉండే సూదిని.. బైక్ ఇంజిన్ యొక్క గాలి పైపులోకి గుచ్చాడు.
సెటప్ అనంతరం యువకుడు బైక్‌ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో కుక్కర్ మరిన్ని నీళ్లు పోసి.. కాల్షియం కార్బైడ్ వేస్తాడు. మళ్లీ బైక్‌ను స్టార్ట్ చేశారు. అప్పుడు బైక్ సులభంగా స్టార్ట్ అవుతుంది. ఆపై బైక్ ముందుకు కదులుతుంది. వెనకాల మరో యువకుడు కుక్కర్ పట్టుకుని కూర్చొని ఉంటాడు. అయితే ఇది స్థిరమైన పద్ధతి కానప్పటికీ.. ఒక ప్రయోగంగా మాత్రం చెప్పుకోవచ్చు. దీని ఆధారంగా భవిస్యత్తులో బైక్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇందుకు సంబందించిన వీడియోను 'MR. INDIAN HACKER' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. 'ఈ వీడియోలో మేము పెట్రోల్ లేకుండా నీటితో బైక్‌ని నడపడానికి ప్రయత్నించాం' అని క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'నీటితో నడిచే బైక్ వస్తే బాలాగుంటుంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Free Petrol: బంపర్ ఆఫర్.. 20000 కంటే ఎక్కువ పెట్రోల్ పంపుల వద్ద ఉచిత పెట్రోల్!
Also Read: Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా.. భారత్ నుంచి 'ఒకే ఒక్కడు' కింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.