Coocaa Smart Tv Price: మార్కెట్లోకి మరో 4k స్మార్ట్ టీవీ.. దీని ఫీచర్లపై మల్టీ నేషనల్ బ్రాండ్స్ కూడా పనికిరావు..

Coocaa Smart Tv Price: స్మార్ట్ టీవీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ కంపెనీలు టీవీల తయారీకి ముగ్గు చూపుతున్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా మార్కెట్లోకి టీవీలను విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ కొత్త కంపెనీ తమ స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 6, 2023, 12:14 PM IST
Coocaa Smart Tv Price: మార్కెట్లోకి మరో 4k స్మార్ట్ టీవీ.. దీని ఫీచర్లపై మల్టీ నేషనల్ బ్రాండ్స్ కూడా పనికిరావు..

Coocaa Smart Tv Price: Coocaa తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 4K డిస్ప్లేతో కూడిన స్మార్ట్ టీవీ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది లభించబోతోంది. ఈ స్మార్ట్ టీవీ K3 సిరీస్ పేరుతో మార్కెట్లో లభిస్తోంది.  ఈ టీవీ 50 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు పరిమాణాలలో అందుబాటులో ఉండనుంది. ఇంతకుముందున్న స్మార్ట్ టీవీలతో పోలిస్తే ఈ టీవీ అత్యాధునిక టెక్నాలజీని కలిగిన డిస్ప్లే తో లభించబోతోంది. రిచ్ సౌండ్ అనుభూతి కోసం కంపెనీ డాల్బీ సౌండ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలో HDR 10 సపోర్ట్ ఆప్షన్ కూడా లభించబోతోంది. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన మరిన్ని ఫీచర్లు, ధర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 
Coocaa TV K3 ధర విషయానికొస్తే..
Coocaa TV K3 ధర సుమారు రూ. 22,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కంపెనీ ఈ టీవీ స్క్రీన్ పరిమాణాన్ని బట్టి ధరలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ ని దేశవ్యాప్తంగా  50 అంగుళాల డిస్ప్లే పరిమాణంతో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. తర్వాత టాప్ మోడల్‌లో 75 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన టీవీ కస్టమర్లకు అందించబోతున్నట్లు పేర్కొంది. ఈ స్మార్ట్‌ టీవీ 4K డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో మీరు హై ఫిక్చర్‌ క్లారీటితో మంచి సినిమా అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా ఈ టీవీలో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

Coocaa TV K3 స్పెసిఫికేషన్‌లు:
✽ 4K డిస్ప్లే
✽ డాల్బీ సౌండ్‌
✽ 32GB ఇంటర్నల్ స్టోరేజ్
✽ OS 9 ఆపరేటింగ్ సిస్టమ్‌
✽ DSP డిజిటల్ ఆడియో ప్రాసెసింగ్ టెక్నాలజీ
✽ డాల్బీడీకోడింగ్ 
✽ వృద్ధుల కోసం ఎల్డర్ మోడ్ టెక్నాలజీ
✽ వాయిస్ కమాండ్ ఫీచర్
✽ NFC వన్‌టచ్ కాస్టింగ్
✽ అన్ని రకాల హార్డ్‌వేర్‌ పోర్ట్స్‌
✽ USB 2.0 పోర్ట్స్‌

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News