New Samsung Mobile: డెడ్‌ ఛీప్‌గా Samsung Galaxy f04 మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు..

Dead Cheap Samsung Mobile: శాంసంగ్ కంపెనీ మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దాని పేరు  గెలాక్సీ ఎఫ్04గా నామకరణం చేసింది. అయితే ఈ మొబైల్‌ చాలా తక్కువ బడ్జెట్‌లోనే లభించనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 12:14 PM IST
New Samsung Mobile: డెడ్‌ ఛీప్‌గా Samsung Galaxy f04 మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు..

Dead Cheap Samsung Mobile: శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్04 తొలి సేల్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది 4 GB ర్యామ్‌, 64 GB స్టోరెజ్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను అవసరమైనప్పుడు 8 GB వరకు పెంచుకోవచ్చు. దీని ప్రస్తుతం ధర రూ. 11,999 కాగా..ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 25% తగ్గింపుతో రూ. 8,999 ధర అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌ కొనుగోలు చేసే క్రమంలో ICICI లేదా సిటీ బ్యాంక్ కార్డ్‌తో చెల్లించిస్తే దాదాపు రూ. 1,000 దాకా తగ్గింపు పొందొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ ఫోన్‌ డెడ్‌ ఛీప్‌గా కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ వినియోగిస్తే దాదాపు రూ. 8,400 దాకా తగ్గింపు లభిస్తుంది. అయితే అన్ని ఆఫర్లు పోను కేవలం రూ.599కే లభించనుంది. అయితే ఈ డిస్కౌంట్‌ మీ పాత ఫోన్‌ కండిషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వేళా పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే తక్కువ ధరకే లభించనుంది.

Samsung Galaxy F04 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 ఫోన్‌ 720x1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 16M కలర్ డిస్ప్లే డెప్త్‌తో వస్తోంది. అయితే ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉండగా.. ర్యామ్‌ ప్లస్‌ ఫీచర్‌ కారణంగా 8 జీబీ వరకు కూడా ర్యామ్‌ పెంచుకొవచ్చు. ఈ ఫోన్‌ MediaTek Helio P35 చిప్‌సెట్‌ పై పని చేయనుంది. ఇక స్టోరెజ్‌ విషయానికొస్తే 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో అందుబాటులోకి వచ్చింది.

ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలు సెట్‌అప్‌తో వస్తోంది. వీటిలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కాగా.. 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో అందుబాటులో ఉంది. సెల్ఫీ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉండనుంది.1TB వరకు మైక్రో SD కార్డ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ కూడా లభించనుంది.

Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..! 

Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News