Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటున్నారా.. ఇదిగో ఈ సింపుల్ ప్రొసీజర్‌ ఫాలో అవండి..

Step by Step Guide to Apply Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఎలా అప్లై చేయాలో తెలియదా... ఆన్‌లైన్‌లో సింపుల్‌గా ఎలా అప్లై చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 21, 2022, 11:59 AM IST
  • వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
  • ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి
  • స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకోసం...
Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటున్నారా.. ఇదిగో ఈ సింపుల్ ప్రొసీజర్‌ ఫాలో అవండి..

Step by Step Guide to Apply Driving Licence: రోడ్డుపై వెహికల్ డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ తప్పనిసరి. కొంతమంది ఆర్టీఓ లైసెన్స్ పొందడం కోసం బ్రోకర్స్‌ను సంప్రదిస్తారు. లైసెన్స్ అప్లై చేయడం దగ్గరి నుంచి లైసెన్స్ వచ్చేవరకూ అంతా బ్రోకర్సే చూసుకుంటారు. ఇందుకోసం ఫీజు కూడా భారీగానే తీసుకుంటారు. అయితే బ్రోకర్స్‌ను సంప్రదించకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే సొంతంగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. మొదట లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్, ఆ తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అప్లై చేసుకోండి : 

మొదట  https://parivahan.gov.in/parivahan/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
హోంపేజీలో ఆన్‌లైన్ సర్వీస్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత 'డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేయండి.
లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్‌ ఆప్షన్ క్లిక్‌పై చేయండి.
అక్కడ ఇచ్చిన గైడ్‌లైన్స్ చదివి.. దాని ప్రకారం మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.
ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్ ఫామ్ నింపి.. సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
టెస్ట్ డ్రైవ్ కోసం డేట్ సెలెక్ట్ చేసి.. అక్కడ పేర్కొన్న రుసుమును చెల్లించండి.

కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ద్వారానే లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. కానీ కొన్ని రాష్ట్రాల్లో సంబంధిత డాక్యుమెంట్స్‌తో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో లెర్నింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారు https://transport.telangana.gov.in/html/obtaining-a-learners-licence.html వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ ట్రాఫిక్ సైన్స్, డ్రైవర్ రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించిన ఒక టెస్ట్ ద్వారా లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తారు. సంబంధిత డాక్యుమెంట్స్ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో గమనించవచ్చు. 

Also Read: Amit Sha Munugodu Meeting Live Updates: షెడ్యూల్ కు గంట ముందే హైదరాబాద్ కు  అమిత్ షా.. మునుగోడు ప్రచారానికి ప్రియాంక గాంధీ?

Also Read:Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి.. ఇద్దరు విద్యార్థుల అరెస్టుతో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News