Huawei Nova 11 Se Price: సూపర్‌ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Huawei Nova 11 Se మొబైల్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Huawei Nova 11 Se Price: అతి తక్కువ ధరలోనే హువావే(Huawei) నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ Huawei Nova 11 SE పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2023, 12:37 PM IST
 Huawei Nova 11 Se Price: సూపర్‌ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Huawei Nova 11 Se మొబైల్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

 

Huawei Nova 11 Se Price: బడ్జెట్‌ ధరలో హువావే(Huawei) నుంచి మరో స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 3న విడుదల కాబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను Huawei Nova 11 SE పేరుతో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్మార్‌ఫోన్‌ ఇంతక ముందే చైనాలో ప్రారంభించగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మొబైల్‌ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్స్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏయే ఫీచర్స్‌తో రాబోతుందో, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గతంలో హువావే కంపెనీ Huawei Nova 11, Nova 11 Pro, Nova 11 Ultra సిరీస్‌ల్లో విడుదల చేసింది. అయితే దీనికి సక్సెసర్‌గా Nova 11 SE రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 4G Qualcomm Snapdragon 778G ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 108MP కెమెరాతో రాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 

Nova 11 SE వేరియంట్‌ల ధర:
ఈ స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్‌లలో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మొదట కంపెనీ  8GB ర్యామ్‌ని కలిగి వేరియంట్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో 8GB + 256GB వేరియంట్ ధర CNY 1999 (సుమారు రూ. 23,000)తో కంపెనీ విక్రయిస్తోంది. అయితే ఇతర దేశాల్లో ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించి ప్రీ-ఆర్డర్స్‌ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ Nova 11 SE వేరియంట్‌ మార్కెట్‌లోకి విడుదలైతే నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో లభించనుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Huawei Nova 11 SE ఫీచర్స్‌:
స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌
2.4 GHz CPU
HarmonyOS 4కి బూట్ 
HD ప్లస్ రిజల్యూషన్‌
6.67-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌
రిఫ్రెష్ రేట్ 90Hz
108-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4500mAh బ్యాటరీ

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News