Macherla: పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం, దౌర్జన్యం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధం

EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్‌ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 22, 2024, 11:31 AM IST
Macherla: పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం, దౌర్జన్యం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధం

Pinnelli Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. పోలింగ్‌ రోజుతోపాటు ఆ తర్వాతి మూడు రోజులు కూడా గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దాడి చేసుకున్నాయి. అయితే మాచర్ల నియోజకవర్గంలో యుద్ధ వాతావరణమే చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం.. ప్రత్యర్థులపై దాడితో హింసాత్మకంగా మారింది. అయితే ఈ దాడి ఘటనలకు సంబంధించి ఆలస్యంగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చేసిన దౌర్జన్యం, అరాచకం బయటపడింది. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది.

Also Read: AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..

పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 202లో ఈనెల 13 పోలింగ్‌ జరిగింది. అయితే పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. ఈవీఎం మిషన్‌లను ఎత్తి పడేశారు. ఆయన దౌర్జన్యాన్ని ఓ ఓటర్ ధైర్యంగా నిలదీశారు. అయితే అతడిపైకి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఓ సాధారణ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. ఆమెతో ఎమ్మెల్యే పిన్నెల్లి దుర్భాషలాడాడు. పిన్నెల్లి సృష్టించిన అరాచకం వీడియోలను ప్రత్యేక దర్యాప్తు బృందం ఈసీకి పంపించింది. ఈ వీడియోలు చూస్తే భయానకంగా కనిపిస్తున్నాయి. పిన్నెల్లి దౌర్జాన్యం ప్రజలందరికి తెలిసింది. మాచర్లలో భయానక వాతావరణానికి కారణం పిన్నెల్లిగా పోలీసులు భావిస్తున్నారు. అతడిపై చర్యలకు ఈసీ సిద్ధమైంది.

Also Read: PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

 

తీవ్రంగా పరిగణించిన ఈసీ
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పీఎస్‌ నంబర్‌ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దాడి మొత్తం వెబ్‌ కెమెరాలో ఈసీ చూసింది. ఈవీఎంల ధ్వంసంపై కేసు నమోదు చేసిన పోలీసులు అందులో ఎమ్మెల్యే పేరుకు పొందుపర్చారు. ఈసీ తీవ్రంగా పరిగణించి దాడి ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News