Infinix Hot 12 Smartphone: ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 12.. చౌక ధర, బెస్ట్ ఫీచర్స్..

Infinix Hot 12 Smartphone: ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. చౌక ధరతో, బెస్ట్ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 18, 2022, 03:12 PM IST
  • ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్ ఫోన్ లాంచ్
  • హాట్ 12 సిరీస్‌లో ఇది మూడో గాడ్జెట్
  • హాట్ 12 ధర, ఫీచర్స్ తదితర వివరాలు మీకోసం
 Infinix Hot 12 Smartphone: ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 12.. చౌక ధర, బెస్ట్ ఫీచర్స్..

Infinix Hot 12 Smartphone: చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 'Infinix Hot 12' ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ హాట్ 12 సిరీస్‌లో ఇది మూడో గాడ్జెట్. ఇప్పటికే హాట్ 12 ప్లే, హాట్ 12i ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. తాజాగా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

ఇన్ఫినిక్స్ హాట్ 12 ధర :

ఇన్ఫినిక్స్ హాట్ 12 సిరీస్‌ ధర రూ.9499. ప్రముఖ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 23 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 7 డిగ్రీ పర్పుల్, టార్కాయిస్, ఎక్స్‌ప్లోరేటరీ బ్లూ, పోలార్ బ్లాక్ కలర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 12 ఫీచర్స్ :

6.82 అంగుళాల వాటర్‌డ్రాప్ నాచ్, హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ
6000 mAh బ్యాటరీ కెపాసిటీ
90Hz రీఫ్రెష్ రేట్
ట్రెడిషనల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యుల్
50 మెగా పిక్సెల్+2 మెగా పిక్సెల్, ఏఐ లెన్స్‌తో కూడిన బ్యాక్ కెమెరా సెటప్
8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఆక్టా కోర్ మిడియా టెక్ హిలియో జీ37 సీపీయూ ప్రాసెసర్

Also Read: Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి.. ఎవరీ పాపన్న ? ఎలా రాజయ్యాడు

Also Read: Kabul Blast: ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు.. రక్తసిక్తమైన మసీదు.. 20 మంది మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News