Infinix Hot 40I: ఇన్‌ఫినిక్స్ నుంచి శభవార్త..మనసు దోచే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Infinix Hot 40i మొబైల్..

Infinix Hot 40I Expected Launch Date In India: టెక్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ (Infinix) శుభవార్త తెలిపింది. అతి త్వరలోనే Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 04:55 PM IST
Infinix Hot 40I: ఇన్‌ఫినిక్స్ నుంచి శభవార్త..మనసు దోచే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Infinix Hot 40i మొబైల్..

Infinix Hot 40I Expected Launch Date In India: ప్రముఖ టెక్‌ కంపెనీ ఇన్‌ఫినిక్స్ (Infinix) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే భారత మార్కెట్‌లోకి Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే పలువురు టిప్‌స్టర్స్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల రెండవ వారంలో విడుదలయ్యే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో సౌదీ అరేబియాలో కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫీచర్లు,స్పెసిఫికేషన్స్:
ఈ Infinix Hot 40i స్మార్ట్ ఫోన్‌  8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి విడుదలైతే అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌ కలిగి మొబైల్‌ అవుతుంది. దీంతో పాటు ఇది 8 GB వర్చువల్ ర్యామ్‌నుతో పాటు మైక్రో SD కార్డ్ స్లాట్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌  6.56 అంగుళాల LCD ప్యానెల్‌తో అందుబాటులోకి రానుంది. ఇది  HD+ రిజల్యూషన్‌తో రాబోతుందని పలువు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. 

ఇది 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్‌ Unisoc T606 ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాట ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పలువురు టెక్‌ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కొంతమంది టిప్‌స్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 8న లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీ, 18-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌తో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీతో రాబోతోంది. దీంతో పాటు భద్రత కోసం బయోమెట్రిక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులో రాబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News