iPhone 14 Price @ Rs 34,000 : ఐఫోన్ 14పై భారీ తగ్గింపు, 80 వేల ఫోన్ ఇప్పుడు కేవలం 34 వేలకే , ఎలాగో తెలుసా

iPhone 14 Price @ Rs 34,000: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. మరో నాలుగు నెలల్లో ఐఫోన్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్ కానుంది. యాపిల్ కొత్త సిరీస్ లాంచ్ కాకుండానే ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 6, 2023, 05:02 PM IST
iPhone 14 Price @ Rs 34,000 : ఐఫోన్ 14పై భారీ తగ్గింపు, 80 వేల ఫోన్ ఇప్పుడు కేవలం 34 వేలకే , ఎలాగో తెలుసా

iPhone 14 @ 34,000 Rupees only: యాపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 సెప్టెంబర్ నెలలో లాంచ్ కావచ్చు. ప్రస్తుతం లాంచింగ్ కోసం కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రతియేటా సెప్టెంబర్ నెలలోనే ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ జరుగుతుంటుంది. సాధారణంగా కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత సిరీస్ ధర తగ్గడం ఎప్పట్నించో జరుగుతున్న ప్రక్రియ.

అయితే ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తోంది. ఐఫోన్ 15 లాంచ్‌కు నాలుగు నెలల ముందే ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిపోయింది. ఐఫోన్ 14 కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. 80 వేల ఐఫోన్ 14పై ఏకంగా 34 వేల తగ్గింపు లభించనుంది. మార్కెట్‌లో ఐఫోన్ 14 స్టాక్స్ అయిపోతేనే ఐఫోన్ 15 విక్రయాలపై ప్రభావం పడకుండా ఉంటుంది. అందుకే ఐఫోన్ 14 కొనాలంటే ఇదే సరైన సమయం. మళ్లీ ఇలాంటి అద్భుతమైన ఆఫర్ రాకపోవచ్చు. అయితే ఈ తగ్గింపు ఆఫర్ ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 14 మార్కెట్ ధర 79,900 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే భారీ ఆఫర్ వర్తిస్తుంది. ఏకంగా 11 శాతం డిస్కౌంట్ అందుతుంది. అంటే 11 శాతం డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 14 ధర కేవలం 70,999 రూపాయలు మాత్రమే. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరిపితే మరో 4000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. 4 వేల డిస్కౌంట్ తరువాత ఐఫోన్ 14 ధర 66,999 రూపాయలవుతుంది. ఈ ధర కూడా ఎక్కువైతే ఎక్స్చేంజ్ ఆఫర్ లబ్ది ఉండనే ఉంది. ఐఫోన్ 14పై ఎక్స్చేంజ్ ధర 33 వేల రూపాయలుగా ఉంది. ఎక్స్చేంజ్ ధర మినహాయిస్తే  33,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుంది, పూర్తిగా వర్తిస్తుందా లేదా అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఉంటుంది. కండీషన్ బాగుండటమే కాకుండా లేటెస్ట్ మోడల్ అయుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఐఫోన్ 14 కేవలం 34 వేలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. 

Also read: Upcoming Phones June 2023: ఈ నెలలో లాంచ్ కాబోతున్న అదిరిపోయే స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News