Iqoo Z7 Pro 5G Price: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో Iqoo Z7 Pro 5G మొబైల్‌..లాంచింగ్‌ తేది, ధర వివరాలు ఇవే!

Iqoo Z7 Pro 5G Pre Review: iQoo త్వరలోనే ఇండియాలో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ విడుదల చేయబోతోందని కంపెనీ వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే వివరించింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 9, 2023, 10:12 PM IST
Iqoo Z7 Pro 5G Price: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో Iqoo Z7 Pro 5G మొబైల్‌..లాంచింగ్‌ తేది, ధర వివరాలు ఇవే!

Iqoo Z7 Pro 5G Pre Review: వివో సబ్‌ బ్రాండ్‌ iQoo త్వరలోనే భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ iQoo Z7 Pro 5G పేరుతో  ఆగస్టు 31న విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌ ఫోన్‌ హోల్-పంచ్ కటౌట్‌ డిస్‌ప్లేను కలిగి ఉండబోతోందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 4,600mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుందని సమచారం. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

అయితే ఇప్పటికే కంపెనీ  Amazon Indiaలోని మైక్రోసైట్ iQoo Z7 Pro 5G సంబంధించిన ఫీచర్లు, ధరకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ డిజైన్‌ విషయానికొస్తే..సరి కొత్త లుక్‌తో కనిపించబోతోంది. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌పై కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు సెంటర్ హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వివరించబోతున్నట్లు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

iQoo Z7 Pro 5G స్పెసిఫికేషన్‌లు:
ఇటీవలే కొందరు టెక్‌ నిపుణులు లీక్‌ చేసిన వివరాల ప్రకారం..iQoo Z7 Pro 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను మొదట రెండు వేరియంట్స్‌లో విడుదల చేయబోతున్నాడు. ఈ రెండు వేరియంట్స్‌ 8ర్యామ్‌ ,12ర్యామ్‌తో పాటు 128జిబి, 256జిబి రోమ్‌ని కలిగి ఉండబోతున్నాయి.  ఈ స్మార్ట్‌ఫోన్‌  4nm MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌ లభించబోతున్నట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

iQoo Z7 Pro 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో మొదటిది 64-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో రాబోతోంది. సెల్ఫీ, వీడియో చాట్ కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుందని టెక్‌ నిపుణులు అంచాన వేస్తున్నారు.

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News