ChatGPT: నా భార్యకు క్షమాపణలు చెబుతూ లెటర్ రాసివ్వు.. అదిరిపోయిన చాట్ జీపీటీ రిప్లై

Man Asks Chatgpt To Write Apology Letter For Wife: తన భార్యకు క్షమాపణలు చెబుతూ.. లెటర్ రాసివ్వాలని ఓ వ్యక్తి చాట్ జీపీటీని అడిగాడు. లెటర్ రాసేందుకు మొదట చాట్ జీపీటీ కూడా ఒప్పుకోలేదు. ఆ తరువాత స్వీట్‌హార్ట్ అంటూ ఓ లెటర్‌ను పంపించింది. అందులో ఏం రాసిందంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 30, 2023, 05:52 PM IST
ChatGPT: నా భార్యకు క్షమాపణలు చెబుతూ లెటర్ రాసివ్వు.. అదిరిపోయిన చాట్ జీపీటీ రిప్లై

Man Asks Chatgpt To Write Apology Letter For Wife: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అయిన చాట్‌ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా మందికి బద్దకం పెరిగిపోయింది. కోడింగ్ నుంచి హిస్టరీ వరకు అన్ని విషయాలపై చాట్ జీపీటీ సమాధాలను ఇస్తుండడంతో కొందరు చిత్ర విచిత్ర ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యక్తిగత విషయాలకు సైతం చాట్‌ జీపీటీని వాడేస్తున్నారు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచేందుకు చాట్‌ జీపీటీపై ఆధారపడుతుండడం గమనార్హం. తాజాగా ఒక వ్యక్తి తన భార్యకు క్షమాపణలు చెబుతూ ఈమెయిల్ రాయమని చాట్‌ జీపీటీని అడిగాడు. రెడ్డిట్‌లో తన చాట్‌ను పంచుకున్నాడు. ఇది చాట్ జీపీటీకి కూడా కష్టమైన పనే అయినా.. వినియోగదారుడికి కచ్చితమైన సమాధానంతో టెక్ట్స్ రూపంలో పంపించింది. మొదట తిరస్కరించినా.. తరువాత క్షమాపణ లెటర్‌ను పంపించింది.   

ఆ వ్యక్తి తన పిల్లలను తీసుకుని భార్యకు చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఈ విషయంపై క్షమాపణలు కోరుతూ లెటర్ రాయమని చాట్‌ జీపీటీని అడిగాడు. మొదట చాట్ జీపీటీకి లెటర్‌కు అంగీకరించలేదు. మళ్లీ ప్రయత్నించగా.. రాసి పంపించింది. "స్వీట్‌హార్ట్.. పిల్లలతో బయటకు వెళ్లాలనే నా ప్లాన్‌ల గురించి నీకు ముందే చెప్పనందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. ఏమైనా ప్లాన్ చేసే ముందు నేను ముందుగా నీతో మాట్లాడి ఉండాలి. నిన్ను గౌరవించకుండా నేను తప్పుచేశాను.  నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో మరింత అవగాహనతో ముందుగానే నీతో కలిసి ప్లాన్ చేస్తా. నేను ముందుగానే క్షమాపణలు కోరుతున్నాను" అని చాట్ జీపీటీ లెటర్‌ను రాసింది.

ఈ లెటర్‌కు ఆమె రిప్లై ఇవ్వకపోతే.. తరువాత ఏం చేయాలని కూడా చాట్ జీపీటీని అడిగాడు ఆ వ్యక్తి. భార్య రిప్లై ఇవ్వకపోతే క్లుప్తంగా ఎస్ఎంఎస్ పంపించాలని సూచించింది. "హాయ్.. నువ్వ ఏం చేస్తున్నావో.. ఎలా ఉన్నావో చూడాలని అనుకుంటున్నా. నేను చేయగలిన సాయం ఏదైనా ఉంటే నాకు చెప్పు. నేను చేస్తాను.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని టెక్ట్స్‌ పంపించాలని చాట్ జీపీటీ తెలిపింది. 

ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను ఆ వ్యక్తి నెట్టింట పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది అతనిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పడానికి సాంకేతికతను ఉపయోగించడంపై తిడుతున్నారు. తాము అయితే ఇలా అడగమని.. స్వచ్ఛమైన మనసుతో నిజాయితీగా క్షమాపణలు కోరతామని చెబుతున్నారు. తప్పుచేశామనే భావన మనసులో నుంచి రావాలని.. ఇలా చాట్ జీపీటీ నుంచి కాదని అన్నారు. 

Also Read: GST On Hostels: హాస్టల్స్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్‌న్యూస్.. ఫీజుల మోత తప్పదా..?  

Also Read: Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర అధికారుల బృందం.. వరద నష్టంపై అంచనా   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News