META AR Glasses: మెటా కనెక్ట్ 2024 ఈవెంట్‌లో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచాన్ని ఆశ్చర్చపరిచే ఓరియన్ ఏఆర్ గ్లాసెస్ పరిచయం చేశారు. మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్న ఫీచర్లు, వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్ ప్రపంచంలో అనుసంధానం చేసేలా ఉండే గ్లాసెస్ ఇవి. పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఇక స్మార్ట్‌ఫోన్ అవసరం ఉండదు.
ప్రస్తుతం ఇంకా అభివృద్ధి దశలో ఉన్న ఈ ఆగ్మంటెడ్ రియాలిటీ గ్లాసెస్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులో రానున్నాయి. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న గ్లాసెస్ ఇవి. పైకి చూడ్డానికి కళ్లద్దాల్లా ఉంటాయి. కానీ చాలా ప్రత్యేకమైనవి. ఇదొక ఫేస్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. వాస్తవ ప్రపంచంలో కన్పించే విజ్యువల్స్‌ని డిజిటల్ ఎలిమెంట్స్‌తో జోడించి కంపాక్ట్ డిజైన్‌ను యూజర్లకు ఏఆర్ టెక్నాలజీతో భారీగా దర్శనమిస్తుంది. ఈ గ్లాసెస్ తోడుంటే ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగం అవసరం లేదంటున్నారు మార్క్ జుకర్‌బర్గ్. ఎందుకంటే ఈ గ్లాసెస్ సహాయంతో మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. సినిమాలు చూస్తూ లేదా సోషల్ మీడియా వీక్షిస్తూనే హోలోగ్రామ్స్ ప్రొజెక్షన్ పని చేయవచ్చు.
ఎలా పనిచేస్తాయంటే
ఇందులో ఉండే మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కారణంగా యూజర్ ముందున్న వస్తువుల్ని పరిశీలించి కొత్త ఐడియాలు ఇస్తుంది. లేదా వాటిని ఎలా ఉపయోగించాలో చెబుతుంది. ఉదాహరణకు ఫ్రిజ్‌లో ఉన్న పండ్లు,కూరగాయలు, ఇతర వస్తువులతో ఎలాంటి వంటలు చేయవచ్చో అడిగితే వెంటనే చెప్పేస్తుంది. అంతేకాదు ఆ వంటల వీడియోలు కూడా చూపిస్తుంది. పనిచేస్తూనే చేతులతో పనిలేకుండా వీడియో కాల్స్, వాట్సప్ , మెసెంజర్ చాట్ చేసుకోవచ్చు. ఇందులో ట్రాన్స్‌పరెంట్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు ఇబ్బంది ఉండదు. వాయిస్ అసిస్టెన్స్‌తో పనిచేస్తుంది.
ఓరియన్ ఏఆర్ గ్లాసెస్‌లో మూడు భాగాలుంటాయి. మొదటిది కంటి అద్దాలు, రెండవది వైర్‌లెస్ బ్యాటరీ ప్యాక్. మూడవది ఆపరేట్ చేసేందుకు రిమోట్‌లా పనిచేసే రిస్ట్ బ్యాండ్. 2027 నాటికి మార్కెట్‌లో రావచ్చని అంచనా.
Also read: Bank Holidays October 2024: అక్టోబర్‌లో అన్నీ సెలవులే, 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.