Iqoo Z9 5G Features, Specifications Leaked: ప్రముఖ టెక్ కంపెనీ ఐక్యూ(iQOO) గుడ్ న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికీ లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ మోడల్ను అధికారికంగా వెల్లడించలేదు. కానీ బెంజ్ మార్క్ ప్లాట్ఫారం జీప్ బెంచ్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన సమాచారం ఇటీవలే పేర్కొంది. ఈ మొబైల్ z9 సిరీస్ తో మార్కెట్‌లోకి లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ను కూడా కంపెనీ ఈ ఫ్లాట్ ఫామ్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోయే ఐక్యూ జడ్ 9 (iQOO Z9 5G) సిరీస్ మొబైల్ మోడల్ I2302 నెంబర్‌ను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు ఇది మీడియా టెక్ ఆక్టా-కోర్ డైమెన్షన్ 7200 ప్రాసెసర్‌ని కలిపి ఉంటుంది. అయితే ఇది ఏ OS పై రన్ అవుతుందో కంపెనీ ఇంకా పేర్కొనలేదు. ఒకవేళ విడుదలైతే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్ మల్టీ-కోర్ పరీక్షలో దాదాపు 2683 పాయింట్లను సాధించింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన SIG వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఈ ఐక్యూ జడ్ 9 (iQOO Z9 5G) స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కాబోతున్నట్లు టిప్‌స్టర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ మొబైల్‌కి ఫీచర్స్‌ను పలువురు టిప్‌స్టర్స్ లీక్ చేశారు. లీక్ అయిన వివరాల ప్రకారం.. 6.64 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ల్పే HD+ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు రెండు (8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 12 GB, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే డైమెన్షన్ 7200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డబుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఇతర ఫీచర్స్:
5000mAh బ్యాటరీ
6.64 అంగుళాల LCD డిస్‌ప్లే
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
50MP ప్రధాన కెమెరా
120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter