Motorola: మంత్ ఎండ్‌ సేల్‌లో బంపర్‌ ఆఫర్స్‌.. ఈ రెండు మొబైల్స్‌పై రూ.8,500పైగా డిస్కౌంట్‌!

Motorola G34 5G - Motorola G32: ఇటీవలే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా విడుదల చేసిన రెండు స్మార్ట్ ఫోన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న మంత్ ఎండ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఈ మొబైల్స్ పై దాదాపు 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 21, 2024, 05:27 PM IST
Motorola: మంత్ ఎండ్‌ సేల్‌లో బంపర్‌ ఆఫర్స్‌.. ఈ రెండు మొబైల్స్‌పై రూ.8,500పైగా డిస్కౌంట్‌!

 

Motorola G34 5G - Motorola G32: మోటరోలా తమ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో కలిగిన స్మార్ట్ ఫోన్స్ చీప్ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ కూడా మోటరోలా మొబైల్ పై మంత్ ఎండ్‌ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన మోటరోలా g32తో పాటు మోటోరోలా g34 మొబైల్ పై బంఫర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ప్రత్యేకమైన సేవలో కొనుగోలు చేసే వారికి అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం ఈ రెండు మొబైల్ రూ.10,000 లోపే లభిస్తాయి. ఇవే కాకుండా వీటిపై ఆధారంగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ పై ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola G34 5G:
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Motorola G34 5G స్మార్ట్‌ఫోన్‌ అన్ని ఆఫర్స్‌ పోను ధర రూ.10,999లకే లభిస్తోంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ పోను రూ.9,999లకే పొందవచ్చు. అలాగే దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా  SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్‌ చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే దీనితో బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి  రూ.10,400 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 400లోపే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా EMI ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌
స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌
రెండు కెమెరాలుLED ఫ్లాష్‌
50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా 
2 మెగాపిక్సెల్ కెమెరా
16 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా 
5000mAh బ్యాటరీ
Android 14
డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్ సెటప్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Motorola G32:
ప్రస్తుతం మార్కెట్లో మోటరోలా G32 స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్స్ పోను కేవలం రూ.10,999కు లభిస్తుంది.  అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో మరింత తగ్గింపుతో లభిస్తుంది. దీంతోపాటు మీరు అదనపు డిస్కౌంట్ పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్‌ చెల్లిస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఎక్స్చేంజ్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.8,500 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను దీనిని కేవలం రూ.1500 లోపే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే
స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా 
5000mAh బ్యాటరీ 
33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News