Loot Deals: మోటరోలా టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 14,000 వరకు తగ్గింపు! ఇంత తగ్గింపు ఇదే మొదటి సారి..

Motorola Smartphones Sale on Flipkart: దీపావళి డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా మోటో ఇటీవలే విడుదల చేసిన మొబైల్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 10:54 AM IST
 Loot Deals: మోటరోలా టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 14,000 వరకు తగ్గింపు! ఇంత తగ్గింపు ఇదే మొదటి సారి..

 

Motorola Smartphones Sale on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి డేస్ సేల్ నవంబర్ 2 నుంచి మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా మోటరోలా ఇటీవలే విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సువర్ణావకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌ మోటోకి సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ సేల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు:
Motorola Edge 30 Fusion:

ఫ్లిప్‌కార్ట్‌లోని ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా Motorola Edge 30 Fusion మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా 30% తగ్గింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ ధర MRP రూ.34,999 కాగా.. ప్రత్యేక సేల్‌లో భాగంగా  రూ.15,000 తగ్గింపుకే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. 

Motorola E13:
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా Motorola E13 స్మార్ట్‌ ఫోన్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 40% తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ MRP ధర రూ.10,999 కాగా ప్రత్యేక ఆఫర్స్‌లో భాగంగా రూ.6,499కే లభిస్తోంది. 

Motorola G32: 
ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనేవారి కోసం బంఫర్‌ డిస్కౌంట్‌తో Motorola G32 మొబైల్‌ లభిస్తోంది. ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ 47% తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP రూ.18,999 కాగా ఈ దీపావళి డేస్ సేల్‌లో భాగంగా రూ.9,999కే లభిస్తోంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Motorola G40 Fusion:
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola G40 Fusion స్మార్ట్ ఫోన్‌ 6GB ర్యామ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ను దీపావళి డేస్ సేల్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 35% తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అలసు ధర రూ.19,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.12,999కే అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై మరింత తగ్గింపు పొందడానికి ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

 Motorola G14:
ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి డేస్ సేల్‌లో భాగంగా Motorola G14పై కూడా స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ది బెస్ట్‌ టైమ్‌గా భావించవచ్చు. ఈ సేల్‌లో దాదాపు 34 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 8,499కే పొందవచ్చు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News