Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతో

Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది. మోటోరోలా త్వరలో లాంచ్ చేయనున్న Motorola G85 ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2024, 05:54 PM IST
Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతో

Motorola G85: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా వాటా కీలకమైంది. ఒకప్పుడు నోకియాతో దీటుగా మార్కెట్ చేజిక్కించుకున్న ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు ప్రవేశించాక కొద్దిగా తగ్గింది. తిరిగి ఇటీవల గత కొద్దికాలంగా అద్బుతమైన ఫీచర్లు, డిజైన్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తూ వాటా పెంచుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మోటోరోలా ఇప్పుడు కొత్తగా Motorola G85 ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న జి84 మోడల్‌కు కొనసాగింపుగా  వస్తోంది. ఈ ఫోన్ 6.55 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 30 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసేస్తూ 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇప్పటికే యూరోప్‌లో లాంచ్ అయిన మోడల్‌లో మాత్రం 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. కర్వ్డ్ డిజైన్ కావడంతో చాలా ఆకర్షణీయంగా ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ కెమేరా ఇచ్చారు.  డాల్పీ ఎట్మోస్ ఫీచర్ ఉండటంతో నాయిస్ కాన్సిలేషన్ వెసులుబాటు ఉంటుంది. ఇది కాకుండా యూఎస్‌బి టైప్ సి పోర్ట్ ఉంటుంది. 

మోటోరోలా జి 85 ధర ఇండియాలో 27 వేలు ఉండవచ్చని అంచనా. మోటోరోలా జి84 ప్రారంభ ధర ఇండియాలో 18,999 రూపాయలుగా ఉంది. ఈ ఏడాదిలోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కావచ్చని అంచనా.

Also read: Royal Enfield New Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్తగా 650 సిసి బైక్స్, 3 బైక్స్ లాంచ్‌కు సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News