OnePlus Open Price In India: OnePlus ఫోల్డబుల్ ఫోన్ నేటి నుంచి మన దేశంలో విక్రయాలు మొదలయ్యాయి. OnePlus ఓపెన్ వినియోగదారులకు రూ.1,39,999 ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉంటుంది. OnePlus.in, OnePlus స్టోర్ యాప్, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, రిలయన్స్ డిజిటల్, Amazon.in, సెలెక్ట్ పార్ట్‌నర్ స్టోర్‌లలో OnePlus ఓపెన్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఓపెన్ సేల్‌లో భాగంగా.. వినియోగదారులు రూ.10 వేల వరకు ఆఫర్ పొందొచ్చు. ప్రస్తుతం మీ వద్ద ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుని రూ.5 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో పాటు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌లు, OneCard ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5 వేలు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం OnePlus ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.
OnePlus Open 20:09 యాస్పెక్ట్ రేషియోతో 6.31-అంగుళాల కవర్ స్క్రీన్ ఉంటుంది. 2800 నిట్‌ల బ్రైట్‌నెస్, 120Hz కవర్ స్క్రీన్, 1400 నిట్‌ల వరకు అధిక బ్రైట్‌నెస్ మోడ్ (HBM) ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 7.82-అంగుళాల 2K 120Hz ఫ్లూయిడ్ AMOLED ProXDR డిస్‌ప్లేతో రిలీజ్ అయింది. డాల్బీ విజన్ వీడియో ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది. హుడ్ కింద.. కొత్త OnePlus ఓపెన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్ 16 GB LPDDR5X RAM, 512 GB UFS 4.0 రీడ్-ఓన్లీ మెమరీ (ROM) ఉంటుంది. దీంతో పాటు 4,805mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 67W SUPERVOOC ఛార్జింగ్‌తో 42 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
OnePlus ఓపెన్ OISతో 48MP Sony LYTIA-T808 "Pixel Stacked" ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 6x ఇన్-సెన్సర్ లాస్‌లెస్ జూమ్, OISతో 64MP పెరిస్కోప్ టెలిఫోటో, ఆటోఫోకస్‌తో 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. బ్యాక్ కెమెరా కాకుండా.. ముందు రెండు సెల్ఫీ కెమెరాలతో వస్తుంది. మెయిన్ డిస్‌ప్లేలో 20MP సెన్సార్, కవర్ స్క్రీన్‌పై 32MP కెమెరా ఉంటుంది. తక్కువ బరువు, చాలా స్లిమ్ డిజైన్, పెద్ద కవర్ స్క్రీన్, గ్రాఫైట్ ఫినిషింగ్‌లోని బ్రష్డ్ మెటల్‌తో ఈ ఫోన్ ఉంటుంది. చూసేందుకు ఫోల్డబుల్ ఫోన్‌గా కాకుండా.. సాధారణ స్మార్ట్ ఫోన్‌గా కనిపించే ఫోన్ మాదిరే స్టైలిష్ లుక్‌లో ఉంటుంది. ఫోన్ రెండు స్క్రీన్‌లలో OnePlus ఉపయోగిస్తున్న సిరామిక్ షీల్డ్‌తో ఫోన్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook