OnePlus Nord CE4 Lite 5G: కళ్లు తెరిచి చూడండి.. 128Gb స్టోరేజ్ వన్‌ప్లస్‌ మొబైల్‌పై రూ.3 వేల డిస్కౌంట్..

OnePlus Nord CE4 Lite 5G Price: అతి తక్కువ ధరలోనే OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. గ్రేట్‌ ప్రిడమ్‌ పెస్టివెల్‌ సేల్‌లో భాగంగా రూ.3 వేల తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా అందుబాటులో ఉంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 5, 2024, 12:14 PM IST
OnePlus Nord CE4 Lite 5G: కళ్లు తెరిచి చూడండి.. 128Gb స్టోరేజ్ వన్‌ప్లస్‌ మొబైల్‌పై రూ.3 వేల డిస్కౌంట్..

OnePlus Nord CE4 Lite 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్‌ ప్రిడమ్‌ పెస్టివెల్‌ సేల్‌ ప్రారంభం కాబోతోంది. ప్రైమ్‌ ఉన్నవారికి ఈ రోజు నుంచే సేల్‌ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు సేల్‌ లైవ్‌ అవుతోంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా భారీగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలే లాంచ్‌ అయిన OnePlus Nord CE4 Lite 5G మొబైల్‌ డెడ్ చీప్‌ ధరలోనే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ప్రస్తుతం ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధర రూ.20,999తో అందుబాటులో ఉంది. దీనిని ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్‌ పోను రూ.19,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

దీనిపై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను ICICI బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఫెడరల్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి కూడా దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.17,999కే కొత్త మొబైల్‌ను పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై నో కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 

అలాగే ఈ మొబైల్‌పై కంపెనీ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసేవారికి దాదాపు రూ.18,100 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను రూ.1,899కే కొత్త OnePlus Nord CE4 Lite 5G ఫోన్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News