Oneplus Smartwatch 2 Price: స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, 100-గంటల స్టాండ్‌ బై బ్యాటరీతో Oneplus Smartwatch 2 వచ్చేసింది..

Oneplus Smartwatch 2 Unveiled: ప్రముఖ టెక్‌ కంపెనీ OnePlus తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. అత్యంత శక్తివంతమైన OnePlus వాచ్ 2ను లాంచ్‌ చేసింది. అయితే దీని ప్రత్యేక ఏంటో ఈ వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 11:21 AM IST
Oneplus Smartwatch 2 Price: స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, 100-గంటల స్టాండ్‌ బై బ్యాటరీతో Oneplus Smartwatch 2 వచ్చేసింది..

Most Powerful Features Oneplus Smartwatch 2 Unveiled | ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ప్లస్‌ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఇది OnePlus వాచ్ 2 పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. వన్‌ప్లస్‌ ఫిబ్రవరి 26న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్‌లో భాగంగా దీనిని లాంచ్‌ చేసిన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వాచ్‌ అనేక రకాల పవర్‌ ఫుల్‌ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు గరిష్టంగా 100 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు పవర్‌ సేవింగ్‌ మోడ్‌ను ఆప్షన్‌ను వినియోగించి దాదాపు 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొడిగించే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ OnePlus వాచ్ 2 స్మార్ట్‌వాచ్‌  GPS కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీని కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌వాచ్‌ ధర వివషయానికొస్తే రూ.24,999తో అదుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాచ్‌ మొత్తం బ్లాక్ స్టీల్, రేడియంట్ స్టీల్ కలర్‌ ఆప్షన్స్‌లో లభించబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లలో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ మార్చి 4వ తేదిన లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. 

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్స్‌:

ఈ స్మార్ట్‌వాచ్‌  1.43 అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాలోకి వచ్చింది. ఈ స్క్రీన్‌ 466 x 466 పిక్సెల్స్‌తో పాటు 60Hz ఫ్లాష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 1,000 పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌  Snapdragon W5 SoC అలాగే BES2700 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 2GB ర్యామ్‌, 32GB ఇంటర్నల్‌ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.  దీంతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్, IP68 రేటింగ్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

అలాగే ఈ OnePlus Watch 2 స్మార్ట్‌వాచ్‌ 7.5W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు పవర్‌ ఫుల్  500mAh బ్యాటరీతో లభించనుంది. ఇది 60 నిమిషాల పాటు చార్జ్‌ చేస్తేయ దాదాపు 100 శాతం ఛార్జ్‌ చేసుకుంటుందని సమాచారం. దీంతో పాటు దీనిని నాన్‌స్టాప్‌గా 48 గంటల పాటు వాడుకోవడానికి ప్రత్యేమైన బ్యాటరీ లైప్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్మార్ట్ మోడ్‌ను వినియోగించి గరిష్టంగా 100 గంటల బ్యాటరీ లైఫ్‌ను కూడా పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News