Oppo Reno 11 Pro Leak: విడుదలకు ముందే Oppo మొబైల్స్‌ లీక్‌..ఫీచర్స్‌ చూస్తే పిచ్చెక్కుతుంది!

Oppo Reno 11 Pro Price: ప్రీమియం సెగ్మెంట్‌లో ఒప్పో నుంచి మరో రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ విడుదల కాబోతోంది. ఈ రెండు మొబైల్స్‌ రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో పేరుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2023, 03:12 PM IST
Oppo Reno 11 Pro Leak: విడుదలకు ముందే Oppo మొబైల్స్‌ లీక్‌..ఫీచర్స్‌ చూస్తే పిచ్చెక్కుతుంది!

Oppo Reno 11 Pro Price: టెక్ బ్రాండ్ Oppo నుంచి ప్రీమియం సెగ్మెంట్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి.  ఇటీవలే విడుదల చేసిన  ఫోల్డబుల్, ఫ్లిప్ డిజైన్ స్మార్ట్ ఫోన్స్‌కు మార్కెట్‌లో మంచి రెస్పాన్స్‌ రావడంతో ప్రీమియం ఫీచర్స్‌తో మరో రెండు స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్స్‌ అతి త్వరలోనే  ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో పేర్లతో లాంచ్‌ కాబోతున్నాయి. ఈ రెండు మొబైల్స్‌  ఒప్పో రెనో లైనప్‌లో రాబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒప్పో రెనో సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ను కంపెనీ నవంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. భారత్‌లో మాత్రం ఈ ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో మొబైల్స్‌ను డిసెంబర్ నెలలో లాంచ్ చేయబోతున్నట్లు టిప్‌ స్టర్స్‌ తెలిపారు. అయితే ఒప్పో ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన విడుదల తేదిలను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండు మోడల్స్‌ MediaTek Dimensity 8200 ప్రాసెసర్, Pro మోడల్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌పై పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

Oppo Reno 11 Pro స్పెసిఫికేషన్‌లు:
ఈ Oppo Reno 11, Oppo Reno 11 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే..డిజిటల్ చాట్ స్టేషన్ టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2160Hz PWMతో హోల్-పంచ్ స్టైల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది Sony IMX890 ప్రధాన కెమెరాతో పాటు Sony IMX355 అల్ట్రా-వైడ్ కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా 2X ఆప్టికల్ జూమ్ సామర్ధ్యంతో Sony IMX709 టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Oppo Reno 11 ఫీచర్స్‌:

  1. MediaTek డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌
  2. LYT600 ప్రధాన కెమెరా
  3. Sony IMX355 అల్ట్రా-వైడ్ కెమెరా
  4. 2x ఆప్టికల్ జూమ్‌
  5. Sony IMX709 టెలిఫోటో సెన్సార్‌
  6. 4800mAh బ్యాటరీ
  7. 67W ఛార్జింగ్‌ సపోర్ట్‌
  8.  LED ఫ్లాష్

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News