Palak Paratha: పలకూర పరాట రెసిపీ.. ఎలా తయారు చేయాలో తెలుసా?

Palak Paratha Recipe: క్రమం తప్పకుండా పలకూర పరాటను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ పలకూర పరాటను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 18, 2024, 02:21 PM IST
Palak Paratha: పలకూర పరాట రెసిపీ.. ఎలా తయారు చేయాలో తెలుసా?

 

Palak Paratha Recipe: పలకూర అనేది ఒక అద్భుతమైన ఆకుకూర.. దీనిని ఇంగ్లీషులో "స్పినాచ్" అని పిలుస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఎక్కువగా సలాడ్లు, సూప్‌లు, ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ ఆకులో శరీరానికి కావాల్సిన విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇందులో ఇతర ఔషధ గుణాలు కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించేందుకు సహాయపడతాయి. అయితే ఈ ఆకు కూరతో రోటీలు, పరాటలను కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా నార్త్‌లో చాలా మంది ఎక్కువగా పరాటలను కూడా తయారు చేస్తారు. అయితే ఇలా తయారు చేసుకున్న పలకూర పరాటను క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితాలు పొందుతారు. ఈ పరాట రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

పలకూర పరాట తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల పాలకూర
1/2 కప్పు గోధుమ పిండి
1/4 కప్పు బియ్యం పిండి
1/4 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
1/2 టీస్పూన్ ధనియాల పొడి
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ కారం
1/2 టీస్పూన్ ఉప్పు
నూనె
1/2 టీస్పూన్ శనగపిండి (ఐచ్ఛికం)

తయారీ విధానం:
ముందుగా ఈ పలకూర పరాటను తయారు చేసుకోవడానికి ఓ బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ బౌల్‌లో పాలకూర వేసి శుభ్రంగా కడగాల్సి ఉంటుంది.
ఒక గిన్నెలో పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత గోధుమ పిండి, బియ్యం పిండి కలిపి, నీటితో కొద్ది కొద్దిగా కలుపుతూ మెత్తటి పిండిని రోటీలా పిండిలా తయారు చేసుకోవాలి.
పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఒక ఉండను చేతిలోకి తీసుకొని, దానిపై కొద్దిగా నూనె రాసి, పలుచగా పరాట లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, పరాటాలను బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చండి.
అదే విధంగా మిగిలిన ఉండలతో పరాటాలను చేసుకోండి.
వేడి వేడిగా పచ్చి మిరపకాయల చట్నీ, పెరుగు లేదా దాల్ మఖానీతో కలిసి సర్వ్ చేయండి.

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

చిట్కాలు:
పరాటాలకు మరింత రుచి రావడానికి, పాలకూర మిశ్రమంలో కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం లేదా క్యారెట్‌ను కూడా కలుపుకోవచ్చు.
పరాటాలను మరింత మెత్తగా చేయడానికి, శనగపిండిని పిండిలో కలుపుకోవచ్చు.
పరాటాలను కాల్చేటప్పుడు, నూనెను ఎక్కువగా వేసుకోకుండా చూడండి.

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News