PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి

PM Kisam Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ వాయిదా డబ్బులు విడుదలయ్యాయి. ప్రతి ఒక్కరికీ నిర్ధిష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది.  ఆ నెంబర్ ఆదారంగానే డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2024, 11:47 AM IST
PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి

PM Kisam Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 17వ వాయిదా డబ్బులు విడుదలయ్యాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ ఈ డబ్బుల్ని విడుదల చేశారు. మీ డబ్బులు ఎక్కౌంట్లో పడకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో చెక్ చేయవచ్చు. కానీ ఆ నెంబరే గుర్తు లేకపోతే ఏం చేయాలి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున రైతుల ఎక్కౌంట్లలో నేరుగా జమ అవుతుంటాయి. ఇందులో భాగంగా 17వ వాయిదా డబ్బులు జూన్ 18న విడుదలయ్యాయి. చాలామంది లబ్దిదారులైన రైతులు ఈ డబ్బులు అందుకుంటున్నా తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతుంటారు. ఎప్పుడైనా డబ్బులు పడకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చెక్ చేయవచ్చు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంట్లో కూర్చుని సులభంగా మీ ఫోన్‌తో తెలుసుకోవచ్చు. 

ముందుగా పీఎం కిసాన్ పధకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు కిందకు స్క్రోల్ డౌన్ చేసి బెనిఫిషియరీ స్టేటస్ దగ్గర క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ముందు కొత్త పేజ్ కన్పిస్తుంది. అందులో నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయాలి. అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి. అంతే వెంటనే స్క్రీన్‌పై మీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకం రిజిస్ట్రేషన్ నెంబర్ కన్పిస్తుంది. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకంలో భాగంగా జూన్ 18న ప్రదాని మోదీ వారణాసి నుంచి 17వ వాయిదా డబ్బులు విడుదల చేశారు. 9.26 కోట్లమంది రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ప్రతి నాలుగు నెలలకోసారి ఏడాదిలో మూడుసార్లు 2 వేల రూపాయల చొప్పున 6 వేలు జమ అవుతుంటాయి.

Also read: NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News