Samsung Galaxy M33 Price: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ వెబ్ సైట్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ప్రవేశపెట్టింది. Samsung, Apple, Xiaomi, Oppo వంటి అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ తో కొనవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ Galaxy M33 5G తగ్గింపులు
శాంసంగ్ గ్యాలక్సీ M33 5G మోడల్ లో 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ. 25,999 కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో 35 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత శాంసంగ్ గ్యాలక్సీ M33 5G స్మార్ట్ ఫోన్ రూ. 16,999 లకే లభిస్తోంది. దీంతో పాటు బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వర్తింపజేయవచ్చు. దీని వల్ల మొబైల్ కొనుగోలు ధర తగ్గుతుంది.
మీరు మొబైల్ ను కొనుగోలు చేయడానికి HDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ. 1,750 డిస్కౌంట్ లభిస్తుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,249 ధరకు అందుబాటులోకి వస్తుంది. SAMSUNG Galaxy M33 స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. మీకు మరింత తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే మీ పాత స్మార్ట్ ఫోన్ పనితీరును బట్టి దాని ఎక్స్ఛేంజ్ ధరను ఫ్లిప్ కార్ట్ సంస్థ నిర్ణయిస్తుంది.
Also Read: Vivo T2 Pro 5G Price: వివో 5G స్మార్ట్ ఫోన్ లాంఛింగ్.. ధర ఎంతో తెలుసా..?
Samsung Galaxy M33 స్పెసిఫికేషన్స్:
1) డిస్ ప్లే - 6.6-అంగుళాల HD+ LCD
2) రిఫ్రెష్ రేట్ - 120 Hz
3) కెమెరా - 50 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా
4) ఫ్రంట్ కెమెరా - 8 మెగా పిక్సెల్స్
5) బ్యాటరీ బ్యాకప్ - 6,000 mAh
6) సెక్యూరిటీ - ఫింగర్ ప్రింట్, సెన్సార్
7) కనెక్టివిటీ - USB టైప్ - C, 5G వంటి సదుపాయాలు ఉన్నాయి.
Also Read: IRCTC South India Tour: 1000 రూపాయలకే సౌత్ ఇండియా మొత్తం చుట్టేయోచ్చు.. EMI ఆప్షన్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook