Diwali Mobile Offer 2023: దీపావళి ప్రత్యేక సేల్ మీకోసం..40 శాతం తగ్గింపుతో Samsung, Realme, Redmi మొబైల్స్..

Best Budget Smartphone Under 10000: దీపావళి ప్రత్యేక సేల్ లో భాగంగా అత్యంత చౌకగా స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి. మీరు కూడా మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ సేల్ లో బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 01:31 PM IST
Diwali Mobile Offer 2023: దీపావళి ప్రత్యేక సేల్ మీకోసం..40 శాతం తగ్గింపుతో Samsung, Realme, Redmi మొబైల్స్..

 

Best Budget Smartphone Under 10000: దీపావళి సందర్భంగా అన్ని ఈ కామర్స్ కంపెనీ వెబ్సైట్లో వస్తువులన్నీ అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా దీపావళికి ముందే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో ప్రత్యేక డీల్ ప్రారంభమైంది. MRP కంటే చాలా తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో మొబైల్ ఫోన్స్ పై ఉన్న ప్రత్యేక డీల్ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అతి తక్కువ ధరతోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సేల్ మీకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ సేల్ లో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు రూ. 12,000లోపే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ పై అమెజాన్ ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్స్ ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ లో కొనుగోలు చేస్తే అత్యధికంగా ఎక్స్చేంజ్ బోనస్ మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy M14 5G:
ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో 6 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ MRP ధర రూ 18,990తో విక్రయించింది. అయితే ఈ Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ దీపావళి ప్రత్యేక డీల్ లో భాగంగా 32 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు రూ.12,990కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మీరు అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.11,990కి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

Realme Narzo 60X 5G:
ఈ Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్ 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ 14,999 కాగా.. ప్రత్యేక సేల్ లో భాగంగా రూ.11,749కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ బ్యాంక్ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 11,749 వరకు తగ్గింపు లభిస్తుంది. 

Redmi 12 5G:
ప్రస్తుతం అమెజాన్ లో ఈ Redmi ఫోన్‌ 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తోంది. స్మార్ట్ ఫోన్ మొదట MRP రూ. 15,999తో విక్రయించింది. అయితే దీపావళి ప్రత్యేక సేల్లో భాగంగా 25 శాతం తగ్గింపుతో రూ.11,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది. దీంతోపాటు మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.11,150 వరకు తగ్గింపు పొందవచ్చు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News